Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాలయ పక్షం ప్రారంభం.. పితృదేవతా పూజలు తప్పక చేయాలట! (video)

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:49 IST)
మహాలయ పక్షం సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమై అక్టోబర్ 6 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. మహాలయ పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. 
 
ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.
 
తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (అక్టోబర్ 6న)నైనా చేసి తీరాలి. 
 
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆ పండు కాస్త బంగారం ముద్దగా మారిపోయింది. మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. 
 
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు అన్నదానం చేయని కారణంగా ఇలా జరుగుతుందని అశరీరవాణి పలుకుల ద్వారా తెలుసుకుని.. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. 
 
ఆ రూపంతో భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి వచ్చాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. 
 
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

Hyderabad: పేషెంట్‌ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం

ఆగస్టు 15 నుండి ఉచిత ప్రయాణ సౌకర్యం- 25లక్షల మంది మహిళలకు ప్రయోజనం

నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులు.. అతనెవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments