Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్.. ఉదయం పూట సూర్య నమస్కారం చేస్తే..?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (17:37 IST)
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలు.. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. దొరికిన సమయాన్ని మంచి పనుల కోసం కరోనా సోకకుండా జాగ్రత్త పడేందుకు ఉపయోగించాలంటున్నారు.. వైద్యులు. 
 
ఇక ఆధ్యాత్మిక పండితులైతే.. లాక్ డౌన్ నుంచి బద్ధకం పెరిగిపోకుండా వుండాలంటే.. సూర్య నమస్కారం తప్పక చేయండి అంటున్నారు. ఇలా చేయడం ద్వారా శరీరానికి డి విటమిన్ లభించడమే కాకుండా.. శరీరం చురుకుగా పనిచేస్తుందని వారు చెప్తున్నారు. సాధారణంగా సూర్య భగవానుడికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వవనేది ఆధ్యాత్మిక పండితుల వాక్కు. 
 
సూర్యభగవానుడి రథానికి ఒకే అశ్వం ఉంటుందనీ, దాని పేరే 'సప్త' అని అంటారు. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందనీ, అదే కాల చక్రం అని చెబుతారు. ఆ చక్రానికి గల 12 ఆకులే మాసాలని అంటారు. అలాంటి సూర్యభగవానుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో పేరుతో పిలవబడుతుంటాడు.
 
సూర్యభగవానుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి, ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి. సకల జీవరాశులకు పోషకుడైన సూర్యభగవానుడిని పూజించడం మరిచిపోకూడదని మహర్షులు కూడా చెప్తున్నారు. అందుకే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానమాచరించి.. సూర్య నమస్కారం చేయడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుందని, శరీరానికి కావలసిన విటమిన్లు కూడా లభిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.     

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments