Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా- 8నెలల గర్భిణీ సొంతూరికి భర్తతోనే కాలినడకన.. చివరికి?

కరోనా- 8నెలల గర్భిణీ సొంతూరికి భర్తతోనే కాలినడకన.. చివరికి?
, సోమవారం, 30 మార్చి 2020 (17:04 IST)
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన దంపతులు నడిచే సొంతూరికి వెళ్లాలనుకున్నారు. ఇలా గమ్యాన్ని చేరే క్రమంలో రెండు రోజుల పాటు ఏమీ తినకుండా గడిపేశారు. వంద కిలోమీటర్ల మేర నడవాలనుకున్నారు. ఇంకా మహిళ గర్భిణీ కావడంతో స్థానికుల సాయం మేరకు సొంతూరికి చేరుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ సహర్ అమర్ ఘడ్‌కి చెందిన భార్యాభర్తలు జీవనోపాధి కోసం దేశ రాజధాని అయినా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఒక్క కంపెనీలో ఆమె భర్త, చిన్న చిన్న పనులు భార్య చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇదే తరుణంలో కరోనా వారి జీవితాలను తారుమారు చేసింది. కరోనా ప్రబావానికి ఉద్యోగం పోయింది. ఇంటి యజమాని గదిని ఖాళీ చేయమన్నాడు. యజమానికి జవాబు ఇవ్వలేని పరిస్థితి కావడంతో రూమ్ ఖాళీ చేశారు. 
 
వారి దగ్గర ఉన్న కాస్త డబ్బుతో సొంత ఊరికి వెళ్లాలనుకున్నారు. కానీ రవాణా సౌకర్యం లేకపోవడంతో.. వారు గుండె నిబ్బరం చేసుకొని సొంతూరికి కాలినడకన బయల్దేరారు. అయితే వివాహిత ఎనిమిది నెలల గర్భవతి కావడం ప్రతీ ఒక్కరిని కదిలించింది. వారి గమ్య స్థానం కోసం భార్యభర్తలు ఇద్దరూ నడుచుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే షహరన్ పూర్ బస్టాండ్ వద్ద స్థానికులు వారిని చూశారు. 
 
అక్కడ నవీన్ కుమార్, రవీంద్ర అనే యువకులు వారిని ఆపి సమస్య అడిగి తెలుసుకున్నారు. యువకులు ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. వారు స్థానికుల సహాకారంతో పోలీసులు నగదు జమ చేసి వారికీ అందజేశారు. దంపతులు రెండురోజుల నుంచి ఏమి తినకపోవడంతో వారికీ అన్నం పెట్టించారు. అనంతరం స్థానికులు అంబులెన్స్ పిలిపించి వారి స్వస్థలానికి పంపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగుల జీతాల్లో కోత..! త్వరలో తెలుగు ప్రభుత్వాల నిర్ణయం?