Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపాష్టమి రోజున ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలను..?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (18:43 IST)
దీపావళి తరువాత, కార్తీక నెల శుక్లపక్ష అష్టమిని గోపాష్టమి (ఈ ఏడాది నవంబర్ 1న)గా జరుపుకుంటారు. ఈ రోజున అరణ్యంలోకి కృష్ణుడిని వెంట ఆవులను పంపినట్లు విశ్వాసం. అందుకే ఈ రోజున ఆవులు ప్రత్యేకంగా పూజలందుకుంటాయి. ఇలా చేస్తే సమస్త దేవతలు గోమాత ఆరాధనతో సంతృప్తి చెందుతారు. 
 
గోవులకు గోపాష్టమి రోజున పశుగ్రాసం, ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలను ఆవుకు పెడితే.. సర్వాభీష్టాలు నెరవేరుతాయి. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే మాత అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. 
 
అందుకే.. గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో కడిగి.. పసుపుకుంకుమలతో అలంకరించుకోవాలి. కొమ్ములకు రంగుల దారాలు కట్టాలి. ఆపై అరటి పండ్లను గోమాతకు నైవేద్యంగా ఇవ్వాలి. 
 
కర్పూర హారతినిచ్చి... గోవును మూడు సార్లు ప్రదక్షణలు చేయాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి. గోవుకు వెనుక భాగం నుంచి కర్పూర హారతిని ఇవ్వాలి. 
 
గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఈ "శ్రీ సురభ్యై నమః" అనే మంత్రాన్ని జపించి, క్రింది స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే, ఆయురారోగ్యైశ్వర్యాలు, అభీష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

లేటెస్ట్

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments