Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్గశిర పౌర్ణమి.. దత్తాత్రేయ జయంతి.. నెయ్యి, నువ్వుల దీపం..

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (09:25 IST)
మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా పౌర్ణమి రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆవాల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించాలి.  మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రాహుకాలం సమయంలో దుర్గామాతకు దీపం వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 
 
పౌర్ణమి అయిన నేడు మధ్యాహ్నం 2:04 గంటల నుంచి మధ్యాహ్నం 2:46 గంటల వరకు విజయ ముహూర్తం కావడంతో ఏదైనా శుభకార్యాన్ని ఈ ముహూర్తంలో ప్రారంభించడం విశేష ఫలితాలను పొందవచ్చు. 26 డిసెంబర్ 2023 సూర్యుడు దక్షిణయానం, ఈరోజు పౌర్ణమి తిథి మరుసటి రోజు 6:03 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 
 
ఈరోజు మృగశిర నక్షత్రం రాత్రి 10:21 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ శ్రీ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి, కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. 
 
దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో జన్మించినందున మధ్యాహ్నం వేళలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం, పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. త్రిమూర్తుల అంశంగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు. స్వామి వారికి పసుపు పువ్వులు, పసుపు వస్తువులను సమర్పించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

తర్వాతి కథనం
Show comments