Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-08-2019- గురువారం మీ రాశి ఫలితాలు..

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (10:25 IST)
మేషం: ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఆత్మీయులకు విలువైన కానుకులు అందిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వాతావరణం అనుకూలించక పోవడం వల్ల మీ పనులు అనుకూలంగా సాగవు. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృషభం: ప్రింటింగ్ రంగాల వారికి కొత్త పనులు చేపట్టే విషయంలో పోటీ అధికమవుతుంది. తలపెట్టిన పనిలో ఆటంకాలు, ఒత్తడి వంటి చికాకులు ఎదురవుతాయి. ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. అయిన వారి నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
 
మిథునం: భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి ఉంటుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. దైవ, పుణ్య కార్యాలలో ఇతోధికంగా వ్యవహరిస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. నిరుద్యోగులు పోటి పరీక్షలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందుతారు.
 
కర్కాటకం: బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ధోరణి నిరుత్సాహపరుస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకోని సదవకాశాలు లభిస్తాయి. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
సింహం: కొబ్బరి, పండ్ల, పూల, హోటల్, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం పై చదువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. బంధువుల రాక ఆనందాన్నిస్తుంది.
 
కన్య: ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు.
 
తుల: కొబ్బరి, పండ్లు, పానియ వ్యాపారులకు కలిసివస్తుంది. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. స్త్రీలపై సన్నిహితులు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షించవలసి వస్తుంది.
 
వృశ్చికం: ఆర్థికస్థితి ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆత్మీయులకిచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వైద్య రంగాల వారికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు.
 
ధనస్సు: వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాల నిస్తాయి. సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి. మొండి బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. మీ సృజనాత్మకతతో మీరు కోరుకున్న రంగంలోకి ప్రవేశించేందుకు ఇది ఉత్తమమైన సమయం. బంధువుల రాకతో ఖర్చులు అధికం.
 
మకరం: విద్యార్థులకు ఏకాగ్రత లోపం అధికమవుతుంది. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయమవుతాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం శ్రేయస్కరం.
 
కుంభం: స్త్రీలకు వస్త్ర, ఆభరణాల పట్ల మక్కువ అధికమవుతుంది. నూతన వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాల బాటలో సాగుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. బ్యాంకింగ్ వ్యవహారాలలోని పనులు సానుకూలమవుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
మీనం: పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గృహోపకరణాలు, వాహనం అమర్చుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. భాగస్వామిక వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

తర్వాతి కథనం
Show comments