Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21-08-2019 బుధవారం దినఫలాలు - ఆదాయ వ్యయాలు మీ...

21-08-2019 బుధవారం దినఫలాలు - ఆదాయ వ్యయాలు మీ...
, బుధవారం, 21 ఆగస్టు 2019 (09:21 IST)
మేషం: విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహకారం అందిస్తారు.
 
వృషభం: స్త్రీలు చొరవగా వ్యవహారించి ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దంపతుల మధ్య చికాకులు తప్పవు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కుతాయి. అరుదైన సత్కారాలు, సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
 
మిధునం: ఆదాయ వ్యయాలు మీ అంచనాలను మించుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. స్త్రీలు పనివారతో ఇబ్బందులను ఎదుర్కుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, ఏజెన్సీలు, లీజు, నూతన టెండర్లకు అనుకూలం. బందువులతోను, ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి.
 
కర్కాటకం: వైద్య, టెక్నికల్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వాహన చోదకులకు ఊహించని చికాకులెదురవుతాయి. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో లైక్యంగా వ్యవహరించండి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది.
 
సింహం: విద్యార్ధులు విదేశీ చదవుల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. కార్యసాధనలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. అర్థాంతంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.
 
కన్య: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. స్త్రీలపై చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేతి వృత్తి, వ్యాపారులకు కలిసివస్తుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు.
 
తుల: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారికి పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూకుతుంది. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
వృశ్చికం: కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశముంది. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. వైద్యులకు ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. ఆదాయానికి  మించి ఖర్చులుంటాయి.  
 
ధనస్సు: మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలుపెడతారు. సన్నిహితుల సలహాను పాటించి ఒక సమస్యను అధికమిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభం. మహిళా ఉద్యోగస్తులకు తోటివారి వల్ల చికాకులు, అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది.
 
మకరం: ఉద్యోగస్తులకు తోటివారి వల్ల చికాకులు, పనిభారం తప్పవు. ఆకస్మికంగా దూరప్రయాణాలు చేస్తారు. బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. వ్యాపారాభివృ్ద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా మెలగండి.
 
కుంభం: దైవకార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించటం శ్రేయస్కరం కాదు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదురుల నుంచి అభ్యంతరాలెదుర్కుంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
మీనం: ఆర్ధికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. నూతన వ్యాపారాలు, ఉపాథి పథకాల్లో అనుభవం గడిస్తారు. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకువస్తాయి. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేయునపుడు పునరాలోచన అవసరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల- రూ.10వేలు ఇస్తే.. ఇక శ్రీవారి బ్రేక్ దర్శనం