శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 19-09-17

మేషం: కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ అవసరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. బ్

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (05:42 IST)
మేషం: కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ అవసరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : వ్యాపారలావాదేవీలు ఊపందుకుంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. బంధువులతో మనస్పర్థలు తలెత్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వాగ్ధాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
మిథునం: ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి. ఆత్మీయులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు.
 
కర్కాటకం: ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఏకపక్ష నిర్ణయం తగదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహన చోదకులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం.
 
సింహం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. అయిన వారే మీ వైఖరిని తప్పుబడతారు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కన్య: స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కృషి పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పదవులు, సభ్యత్వాల నుంచి తప్పుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి.
 
తుల: ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు వుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. సభ, సమావేశాల్లో పాల్గొంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
 
వృశ్చికం : ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ప్రముఖుల కలయికతో పనులు సానుకూలమవుతాయి. రావలసిన మొండిబాకీలు వసూలవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.
 
ధనస్సు: ఆదాయానికి మించి ఖర్చులు అధికమవడం వల్ల ఆందోళన చెందుతారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
మకరం: కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. స్త్రీలు శారీరక మానసిక వేదనకు గురవుతారు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
కుంభం: ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. స్త్రీలు ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు చేయడం క్షేమదాయకం కాదు. ధనం మూలంగా కొన్ని పనులు సమకూరుతాయి. ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తారు.
 
మీనం : కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మీ బలహీనతలు అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహిస్తారు. విందులలో పరిమితి పాటించండి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. రుణాలు చేయవలసివస్తుంది. రాజకీయ పరిచయాలు లభ్ధిని చేకూరుస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హర్ష వీణపై 2 కేసులు, కాల్ డిటైల్స్ తనిఖీ చేస్తున్నాం: రైల్వేకోడూరు అర్బన్ సీఐ

తమిళనాడులో విజయ్ స్వతంత్ర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తే.. పోల్ ఏం చెప్తోంది?

పాఠశాలల్లో విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించాలి : సుప్రీంకోర్టు

ఓల్డ్ స్టూడెంట్స్ రూ. 100 కోట్ల విరాళం.. గుంటూరు ఆస్పత్రిలో ఆ కేంద్రం ప్రారంభం

ఢిల్లీ వేదికగా గోదావరి జలాలు ఏపీకి తరలించేందుకు కుట్ర : హరీష్ రావు ఆరోపణ

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments