Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 14-09-17

మేషం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత చాలా అవసరం. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. ఇప్పటి వరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తు

Advertiesment
daily prediction
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (05:49 IST)
మేషం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత చాలా అవసరం. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ఆలస్యంగా అందుతుంది. ఇప్పటి వరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం  చేసుకోగలుగుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
వృషభం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మార్కెటింగ్ రంగాల వారికి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉద్యోగులు, అవమానాలను ఎదుర్కొంటారు.
 
మిథునం: ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. చిన్న తరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది.
 
కర్కాటకం: స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. అదనపు బరువు బాధ్యతలను స్వీకరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ముఖ్యులలో మాటపట్టింపు వచ్చే ఆస్కారం వుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరుతుంది.
 
సింహం : సన్నిహితులతో కలిసిచేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఉపాధ్యాయుల తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం మంచిది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించత పోవడంతో ఆందోళనకు గురవుతారు. స్త్రీలలో అసహనం, అశాంతి చోటుచేసుకుంటాయి.
 
కన్య: ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఓర్పు, రాజీ ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
 
తుల : రాజకీయ నాయకులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. పోగొట్టుకున్న అవకాశం, పత్రాలు తిరిగి పొందుతారు. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం ఇబ్బందులకు గురి కావలసివస్తుంది.
 
వృశ్చికం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. ఉద్యోగస్తులు, అధికారులు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీ గౌరవాభిమానాలకు భంగం కలిగే సూచనలున్నాయి. మీ సమర్థత, నిజాయితీలు ఆలస్యంగా వెలుగుచూస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి.
 
ధనస్సు: ఊహించని రీతిలో ధనలబ్ధి పొందుతారు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రేమికులు అవగాహనా లోపం వల్ల విడిపోయే ఆస్కారం ఉంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత, మెళకువ వహించండి. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు.
 
మకరం: ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. ప్రైవేట్ సంస్థల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ప్రయోజనం పొందుతారు. కళాకారులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు.
 
కుంభం: మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.  కాంట్రాక్టర్లు, మధ్యాహ్న భోజన పథక ఏజెంట్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం : కాంట్రాక్టర్లు, మధ్యాహ్న భోజన పథక ఏజెంట్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. స్త్రీలకు టీవీ ఛానెళ్లనుంచి ఆహ్వానం అందుతుంది. బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తత అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారిని ఇలా సేవిస్తే సాక్షాత్కరిస్తాడు...