Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారిని ఇలా సేవిస్తే సాక్షాత్కరిస్తాడు...

తిరుమలను మొట్టమొదటగా ఏమని పిలిచేవారో తెలుసా... చరిత్రకు దొరికినంత వరకు తిరుమలకు సంబంధించిన తొలి ప్రస్థావన తొల్కాప్యన్ అనే తమిళ గ్రంథంలో ఉంది. ఈ తొల్కాప్యన్ నిన్నామొన్నటిది కాదు. 2200 సంవత్సరాలకు ముందు రాయబడిన తమిళ భాషా గ్రంథం. అంతేకాదు తొలి సాహిత్యం

Advertiesment
lord venkateswara
, బుధవారం, 13 సెప్టెంబరు 2017 (15:46 IST)
తిరుమలను మొట్టమొదటగా ఏమని పిలిచేవారో తెలుసా... చరిత్రకు దొరికినంత వరకు తిరుమలకు సంబంధించిన తొలి ప్రస్థావన తొల్కాప్యన్ అనే తమిళ గ్రంథంలో ఉంది. ఈ తొల్కాప్యన్ నిన్నామొన్నటిది కాదు. 2200 సంవత్సరాలకు ముందు రాయబడిన తమిళ భాషా గ్రంథం. అంతేకాదు తొలి సాహిత్యం కూడా ఇదే. ఈ తొల్కాప్యియన్ గ్రంథంలో తిరుమలను వేంగడం అని సంబోధించారు. వేంగడం అనే పదానికి ఉన్న అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు. 
 
తమిళ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దు.. వేంగడం అంటే అర్థం ఇదే. తమిళ రాష్ట్రానికి తిరుమల కొండలు ఉత్తర సరిహద్దుగా ఉండేది. ఈ వేంగడమనేదే వెంకటంగా మారింది. వేంగడం కొండల్లోని దేవుడు వేంకటేశ్వరుడు అయ్యాడు. వేంకటేశ్వరస్వామి అనే పేరు ఇలానే వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. 1944లో బ్రిటీష్ వారు తిరుమల కొండకు ఘాట్ రోడ్డు వేశారు. అప్పట్లో మనల్ని పరిపాలించింది వాళ్ళే కదా. కానీ రోడ్డును వేసిన ఇంజనీర్ మాత్రం మన తెలుగు వాడే. ఆయనే భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య. రోడ్డు వేసినప్పటి నుంచి భక్తులు బస్సుల్లో వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు.
 
అంతకుముందయితే జంతువులను, పాములను, దొంగలను వీరందరినీ అతికష్టం మీద తప్పించుకుంటూ కొన్ని రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వెళ్ళి దర్శించుకునేవారు. అప్పట్లోనే కాలిబాటలు నాలుగు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం మూడే మిగిలాయి. తిరుపతి నుంచి అలిపిరి కాలిబాట, చంద్రగిరి నుంచి శ్రీవారిమెట్టు, మామండూరు నుంచి అన్నమయ్య కాలిబాట. అన్నింటిలోకి ముఖ్యమైంది అలిపిరి కాలిబాటే. అలిపిరి బాటలోనే రామానుజాచార్యులు వెయ్యి సంవత్సరాలకు ముందు మోకాళ్ళ మీద కొండను ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
శైవులు ఆక్రమించుకున్న తిరుమల కొండను తిరిగి వైష్ణవ క్షేత్రంగా మార్చింది రామానుజులే. అలిపిరి అంటే అందరికీ తెలుసు. అయితే పాదాల మండపం కొద్దిగా ముందుకు రాగానే ఒక శిల్పం కనిపిస్తుంది. ఆ రోజుల్లో దాసరులు అనబడే వైష్ణవులు భిక్షాటన చేస్తూ జీవించేవారు. దాసరి అంటే వెనుక బడిన కులంలో పుట్టి వీరవైష్ణవం పుచ్చుకుని వైష్ణవుడుగా మారిన వ్యక్తి. దాసరి అంటే విష్ణుదేవుడి దాసుడు. అలాగే వెనుకబడిన కులాల్లో పుట్టిన వారిలో చాలామందిని వీరశైవం ఆదరించింది. అలా శైవులుగా మారిన వారిని జంగాలు అన్నారు.
 
హరిదాసుడైన ఒక మాల దాసరి శ్రీవారిన దర్సించుకోవడానికి తిరుమలకు బయలుదేరాడు. అలిపిరికి చేరాడు. తొలి మెట్టు ఎక్కబోతూ తిరు వేంకటనాథుడైన స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు జరిగింది ఓ వింత. ఆ మాల దాసరి అలాగే శిలగా మారిపోయాడు. మనం ఇప్పటికీ సాష్టాంగ నమస్కారం చేస్తున్న శిల్పాన్ని అక్కడ చూడవచ్చు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే... సకల చరాచర సృష్టికి మూలమూర్తి అయిన శ్రీ వేంకటేశ్వరస్వామి మహిమ అంతా ఇంతా కాదు. స్వామివారిని పూజించే సమయంలో నేను.. నాది అని అడగడం కన్నా దేవుడా అంతా నువ్వే అన్న భావన ఉంటే ఖచ్చితంగా భక్తుడు అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిష్‌ అక్వేరియం ఇంటిలో పెట్టుకోవచ్చా...?