Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిష్‌ అక్వేరియం ఇంటిలో పెట్టుకోవచ్చా...?

పెద్దపెద్ద కార్యాలయాలు, స్టార్ హోటల్స్, ఇళ్ళల్లో ఫిష్ అక్వేరియం పెడుతుంటారు. ఫిష్‌ అక్వేరియం పెట్టుకోవడంలో శాస్త్రీయత ఉండగా బలమైన నమ్మకం కూడా ఉంది. వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఇంట్లో అక్వేరియం పెట్టుకుంటే పోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సంపద శక్తిని

ఫిష్‌ అక్వేరియం ఇంటిలో పెట్టుకోవచ్చా...?
, బుధవారం, 13 సెప్టెంబరు 2017 (14:13 IST)
పెద్దపెద్ద కార్యాలయాలు, స్టార్ హోటల్స్, ఇళ్ళల్లో ఫిష్ అక్వేరియం పెడుతుంటారు. ఫిష్‌ అక్వేరియం పెట్టుకోవడంలో శాస్త్రీయత ఉండగా బలమైన నమ్మకం కూడా ఉంది. వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఇంట్లో అక్వేరియం పెట్టుకుంటే పోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సంపద శక్తిని గ్రహించేందుకు కూడా అక్వేరియం ఎంతగానో ఉపయోగపడుతుంది. అక్వేరియం చిన్నాదా, పెద్దదా అన్నది కాదు.. ఫలితాలు మాత్రం ఒకే రకంగా ఉంటుంది. 
 
ఫిష్ అక్వేరియం ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయం పడుతుంది. సంపద శక్తిని గ్రహించేందుకు అక్వేరియం బాగా ఉపయోగపడుతుంది. అక్వేరియంను తదేకంగా చూస్తే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. కొంత శక్తి కూడా వస్తుంది. టెన్షన్ కూడా పోతుంది. 
 
ఇంటిలోను, వ్యాపారంలోను ఇబ్బందులు ఉంటే ఫిష్ అక్వేరియంను పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వివిధ రంగుల్లోని అక్వేరియం చేపలు పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇంటిపై దృష్టి పడకుండా అక్వేరియం తనవైపు తిప్పుకుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దక్షిణం, పడమర మూలల్లో అక్వేరియంను ఉంచాలి. అక్వేరియంలో చేపలు ఏవిధంగా అయితే వేగంగా తిరుగుతాయో అదేవిధంగా ఇంటిలోని వారికి వేగవంతమైన సుఖవంతమైన జీవితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలంటే?