Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి ఆనంద నిలయం విశిష్టత (వీడియో)

తిరుమల వేంకటేశ్వరుడి ఆనంద నిలయాన్ని చూడగానే మది పులకించిపోతుంది. ఇంతటి మహత్తరమైన నిర్మాణం ఎవరు మొదలు పెట్టారు? ఎప్పుడు పూర్తి చేశారు? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే కలుగుతాయి. కలియుగ దైవానికి కాస్తంత గూడు కట్టించాలనే ఆలోచన క్రీ.శ 839లోనే కలిగింది. పల్లవ రా

Advertiesment
శ్రీవారి ఆనంద నిలయం విశిష్టత (వీడియో)
, శనివారం, 2 సెప్టెంబరు 2017 (19:07 IST)
తిరుమల వేంకటేశ్వరుడి ఆనంద నిలయాన్ని చూడగానే మది పులకించిపోతుంది. ఇంతటి మహత్తరమైన నిర్మాణం ఎవరు మొదలు పెట్టారు? ఎప్పుడు పూర్తి చేశారు? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే కలుగుతాయి. కలియుగ దైవానికి కాస్తంత గూడు కట్టించాలనే ఆలోచన క్రీ.శ 839లోనే కలిగింది. పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మకు ఆ అవకాశం దక్కింది. గోపురానికి బంగారు పూత ఆయనే మొదలు పెట్టారు. బంగారు పూత వేసే ప్రక్రియ దాదాపు 430 ఏళ్ళు పట్టిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 
 
రాజులు పోయినా తరువాత వచ్చే పాలకులు ఆ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. గోపురానికి బంగారు పూత వేసే కార్యక్రమాన్ని క్రీ.శ 1262లో పాండ్య రాజు సుందర పాండ్య జతవర్మ పూర్తి చేశారు. తరువాత కాలంలోని పాలకులు అందరు శ్రీవారిపై అపారమైన భక్తితో ఎన్నో మార్పుల చేశారు. 1359లో అప్ప సాలవరాజు మంగిదేవ మహరాజు గోపురంపై కొత్త కలశాన్ని ప్రతిష్టించారు. విజయ నగర సామ్రాజ్య మంత్రి చంద్రగిరి మల్ల క్రీ.శ 1417 ఈ గోపురానికి కొత్త హంగులు తీసుక్చొచారు. ఆలంయలోనే కొన్ని మండపాలను నిర్మించారు. అప్పటికే తిరుమలలోని వేంకటేశ్వరునిపై విజయనగర ప్రభువులు అపారమైన భక్తిని ప్రదర్శిస్తున్నారు. 
 
ఇక కృష్ణదేవరాయలు హయాంలో అయితే తిరుమలలో అనూహ్యమైన మార్పలు వచ్చాయి. క్రీ.శ 1513 నుంచి 1521 వరకూ కృష్ణదేవరాయలు ఏడుమార్లు కాలిబాటన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నాయి. ఆయన అందజేసి విలువైన కానుకలు నేటికీ తిరుమల శ్రీవారిని అలంకరిస్తున్నాయి. శ్రీవారికి పెద్ద కిరీటాన్ని బహూహకరించారు. 
 
ఆనంద నిలయాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కృష్ణదేవరాయలు 30వేల బంగారు నాణేలు ఆలయానికి కానుకగా ఇచ్చారు. వీటిని వినియోగించి ఆనంద నిలయానికి బంగారుపూత పూశారు. తరువాత క్రీ.శ 1908 రామలక్ష్మణ్‌ మహంతీ బంగారు కలశాన్ని పునఃప్రతిష్టించారు. క్రీ.శ 1918 ఆగష్టు 18 నుంచి 27 వరకూ ఆనంద నిలయంలోని విమాన వెంకటేశ్వరుడితోపాట కొన్ని విగ్రహాలను శుభ్రపరచి వాటికి మరమ్మత్తులు చేశారు. ఇలా ఎన్నోమార్పులు జరిగినా, వాతావరణంలో ఎంత మార్పు వచ్చినా ఆనంద నిలయం ఇప్పటికే భక్తజనంలో ఆనందాన్ని నింపుతూనే ఉంది. మరిన్ని వివరాలను తెలుపుతూ వీడియో... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళసూత్రం ఇలా వేసుకుంటే వందేళ్ళు సౌభాగ్యం...