Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 09-09-17

మేషం : ఈ రోజు ఇంజనీరింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. రాజకీయ నాయకులకు దూరప్రయాణాలలో మెళకువ అవసరం. నిరుద్యోగులకు తాత్క

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (05:40 IST)
మేషం : ఈ రోజు ఇంజనీరింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. రాజకీయ నాయకులకు దూరప్రయాణాలలో మెళకువ అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక, సంబంధాలు మెరుగవుతాయి.
 
వృషభం : ఈ రోజు విద్యార్థులకు ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించడంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతాయి. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి.
 
మిథునం : ఈ రోజు ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో  అప్రమత్తత అవసరం.
 
కర్కాటకం : ఈ రోజు విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ చిరు వ్యాపారులకు ఆశాజనకం. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. ఫ్లీడర్లకు ఒత్తిడి పెరుగుతుంది.
 
సింహం : ఈ రోజు గృహంలో చేపట్టిన మార్పులు వాయిదాపడతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి.
 
కన్య : ఈ రోజు వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పండుగ, అడ్వాన్స్‌లు మంజూరు కాగలవు. మిత్రుల హితోపదేశం మీపై మంచి ప్రభావం చూపుతుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వంటి చికాకులు తప్పవు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు కొంతమంది యత్నిస్తారు.
 
తుల : ఈ రోజు వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి అనుభవం గడిస్తారు.
 
వృశ్చికం : ఈ రోజు అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రముఖులతో పరిచయాలు అనుకోని విధంగా జరుగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు.
 
ధనస్సు : ఈ రోజు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి.
 
మకరం : ఈ రోజు స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది. నూతన పెట్టుబడులు, లీజు ఏజెన్సీ, టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు.
 
కుంభం : ఈ రోజు భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు రాగలవు. ప్రేమికులకు ఎడబాటు చికాకులు తప్పవు. ఉన్నతస్థాయి ఉద్యోగస్తులు కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు.
 
మీనం : ఈ రోజు పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. ఒక వ్యవహారంలో మీ శ్రీమతి ఇచ్చిన సలహా మంచి ఫలితాన్నిస్తుంది. సంయమనంతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివిగా వ్యయం చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

లేటెస్ట్

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

తర్వాతి కథనం
Show comments