Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 05-09-17

మేషం : ఈ రోజు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెపుతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. బంధుమిత్రుల రాకత

Advertiesment
daily prediction
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (05:45 IST)
మేషం : ఈ రోజు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెపుతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. బంధుమిత్రుల రాకతో పనులు మందకొడిగా సాగుతాయి. వాహన చోదకులకు దూకుడుతగదు. 
 
వృషభం : ఈ రోజు ఆప్తుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. 
 
మిథునం : ఈ రోజు మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభిస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
కర్కాటకం : ఈ రోజు ఉపాధ్యాయులు విందులు, వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. బంధు మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం అధికంగా ఉంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం : ఈ రోజు మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రింటింగ్ రంగంలో వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
కన్య : ఈ రోజు స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
తుల : ఈ రోజు కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. స్త్రీలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. సోదరీసోదరులతో సమస్యలు తలెత్తుతాయి. మీ కళత్ర మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులు బహుమతులు అందుకుంటారు. 
 
వృశ్చికం : ఈ రోజు గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగనిపిస్తుంది. వృత్తుల వారికి కలిసిరాగలదు. ప్రేమికులతో తొందరపాటు చర్యలు సమస్యలకు దారితీస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలు, నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
ధనస్సు : ఈ రోజు దైవకార్యం, విందుల్లో పాల్గొంటారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదు అని గమనించండి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనుకూలం. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా బలపడతాయి. తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
మకరం : ఈ రోజు మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధన బాగా ఖర్చు చేస్తారు. స్థిర బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితులు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. 
 
కుంభం : ఈ రోజు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ ఆలోచనల్లో కొంత మార్పు వస్తుంది. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. 
 
మీనం : ఈ రోజు ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. మీ వ్యాఖ్యలను బంధు మిత్రులు అపార్థం చేసుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ తేదీల్లో పుట్టి ఉంటే మీకు తిరుగేలేదు...!