Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం (03-05-18) దినఫలాలు - క్లిష్ట సమయంలో మిత్రులు జారుకుంటారు...

మేషం: క్లిష్ట సమయంలో బంధు మిత్రులు జారుకుంటారు. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. కార్మీకులకు విశ్రాంతి లోపం. సౌఖ్యం కొంత తగ్గుతు

Webdunia
గురువారం, 3 మే 2018 (08:24 IST)
మేషం: క్లిష్ట సమయంలో బంధు మిత్రులు జారుకుంటారు. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. కార్మీకులకు విశ్రాంతి లోపం. సౌఖ్యం కొంత తగ్గుతుందనే చెప్పవచ్చు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలిస్తాయి.
 
వృషభం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యత వల్ల మనస్సు నిలకడగా ఉండదు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అప్రమత్త అవసరం. కార్మీకులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. 
 
మిథునం: స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం ఉంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం: భాగస్వామికులతో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఇన్‌వర్టర్, ఎ.సి వ్యాపారస్తులకు శుభదాయకం. అపరిచితుల విషయంలో మెళకువ అవసరం.
 
సింహం: ఆర్ధికంగా మెరుగుపడతారు. హోదాలు, పదవీయోగాలు దక్కే సూచనలు ఉన్నాయి. క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
కన్య: ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకం. కళారంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు. 
 
తుల: ఆర్ధికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ప్రయాణాల్లోను, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. పండ్లు, పూలు, చల్లనిపానీయ వ్యాపారులకు కలిసిరాగలదు.
 
వృశ్చికం: ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. చేతి వృత్తుల వారికి అనుకూలం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నూతన దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సహోద్యోగులు, అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు.
 
ధనస్సు: సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ధనప్రలోభం వల్ల అధికారులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాయింట్ వెంచర్లు, సంస్థల స్థాపనలకు అనుకూలం. స్ధిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం మంచిది. 
 
మకరం: హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. ఆకస్మికంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. వైద్యుల తొందరపాటు తనం వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి లాభదాయకం. 
 
కుంభం: వ్యాపార విస్తరణకు భాగస్వాములతో కలిసి నూతన పథకాలు రూపొందిస్తారు. అధ్యాత్మికసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు నిర్మాణపనుల్లో పనివారలతో లౌక్యంగా మెలగవలసి ఉంటుంది. ఖర్చులు ఇతరత్రా చెల్లింపులు అధికమవుతాయి. మీ సమస్య ఒకటి సానుకూలం కావటంతో మానసికంగా కుదుడపడతారు. 
 
మీనం: మీ కుటుంబీకులు మీ మాటా, తీరును వ్యతిరేకిస్తారు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థవంతగా నిర్వహిస్తారు. మీ సంకల్ప బలానికి సన్నిహతుల సహాయం తోడవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

లేటెస్ట్

వినాయక చవితి 2025: ఏకంగా ఐదు యోగాలు.. ఈ రాశుల వారికి అదృష్టం

గణేష్ చతుర్థి: వినాయక పూజ ఎలా చేయాలి?

26-08-2025 మంగళవారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌కు పాల్పడవద్దు...

Ganesh Chaturthi 2025: వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకండి.

Ganesh Chaturthi 2025: గణేశ చతుర్థి రోజున విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం..?

తర్వాతి కథనం
Show comments