Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-04-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.... సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని..

మేషం: నూతన వ్యక్తుల పరిచయాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పోటి పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, కాను

Advertiesment
Daily Horoscope
మేషం: నూతన వ్యక్తుల పరిచయాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పోటి పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృషభం: స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. హోటల్, తినుబండార వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన ఆలోచనలు చుట్టుముడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ఉద్యోగస్తుల కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.
 
మిథునం: బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కర్కాటకం: చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. విదేశీ వ్యవహారాలు, విద్య, రవాణా, ప్రణాళికలు బోధన, ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించండి. మార్కెట్ రంగాలవారికి నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడంతో ఎందులోనూ ఏకాగ్రత వహించలేరు.
 
సింహం: వ్యాపారాభివృద్ధికై చేయు యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కన్య: ఉద్యోగస్తులు అధికారులకు విలువైన కానుకలు అందించి పరిచయాలు పెంచుకుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు ఎటువంటి ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా చిత్తశుద్ధితో వ్యవహరించటం అన్ని విధాలా శ్రేయస్కరం. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు.
 
తుల: ఇతరులకు పెద్ద మెుత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. కొంతమంది మీ నుంచి సమాచారం సేకరించేందుకు యత్నిస్తారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. 
 
వృశ్చికం: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు వేస్తారు. పండ్లు, కొబ్బరి, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సోదరి మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
ధనస్సు: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు సంభవిస్తుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. దూర ప్రయాణాలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి.
 
మకరం: మీరు దేనిని నమ్ముతారో ఆ విషయంపై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. ఎల్.ఐ.సి. పోస్టర్ ఏజెంట్లుకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. 
 
కుంభం: ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది.
 
మీనం: వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలున్నాయి. ప్రయాణాలల్లో స్వల్ప చికాకులు తప్పవు. ఇతరులు చెప్పిన మాటపై దృష్టి పెట్టకండి. కానీ వేళల్లో ఇతరుల రాక ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం (27-04-18) దినఫలాలు - స్నేహితుల వల్ల విలువైన వస్తువులు...