Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళవారం (24-04-18) దినఫలాలు : వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం...

మేషం : స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మందులు, విత్తనాలు, రసాయన వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు

మంగళవారం (24-04-18) దినఫలాలు : వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం...
, మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (08:56 IST)
మేషం : స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మందులు, విత్తనాలు, రసాయన వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరచరాస్తుల విక్రయించాలనే మీ ఆలోచనను విరమించుకోవడం మంచిది. మీ వ్యవహారాలను స్వయంగా సమీక్షించుకోవడం ఉత్తమం. ఆకస్మిక ఖర్చులు, రుణవాయిదా చెల్లింపుల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాల్లో జాగరూకతో మెలగండి. 
 
మిథునం : విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామగ్రిని అందజేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. టెక్నికల్, మెడికల్, వాణిజ్య రంగాల వారికి ఆశాజనకం. కోర్టు వాజ్యాల్లో అనుకూల ఫలితాలుంటాయి. 
 
కర్కాటకం : కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. సంఘంలో మంచిపేరు, ఖ్యాతి లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రముఖుల కలయిక కోసం పలుమార్లు తిరగాల్సి ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. 
 
సింహం : ఆటోమొబైల్, రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. చేయదలుచుకున్న మంచి పని వాయిదా వేయకండి. స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు. 
 
కన్య : నిర్మాణ పథకాల్లో సంతృప్తి కానవస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి.  విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ, వివాహ యత్నాలు నెరవేరుతాయి. ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల : కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలో పునరాలోచన అవసరం. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. విద్యార్థులతో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలం. 
 
వృశ్చికం : వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేసే కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. వాహన నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో మెళకువ అవసరం. 
 
ధనస్సు : ఆత్మీయుల ద్వారా కీలకమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యుల కోసం ధనం ఖర్చు చేస్తారు. స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలో పునరాలోచన అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించండి. 
 
మకరం : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. చిన్నచిన్న ఆటంకాల వల్ల చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ఏకాగ్రత అవసరం. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. బంధువుల రాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. 
 
కుంభం : భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం, పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. 
 
మీనం : ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. నూతన దంపతులకు ఎడబాటు, చికాకులు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంగమ్మ తల్లి భూలోకానికి వచ్చిన కారణం ఏమిటో తెలుసా?