31-03-2019 ఆదివారం దినఫలాలు - కర్కాటకం రాశివారి ఫలితాలు ఇలా ఉన్నాయి...

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (09:58 IST)
మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఏదో తెలియని ఆందోళన, నష్టపోతున్నానేమో అనే భావన ఎక్కువ అవుతుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలకు పనిభారం అధికం. 
 
వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులు విసుకు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. స్త్రీల పట్టుదల వలన కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. దూరప్రయాణాల్లో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి.
 
మిధునం: నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం: రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఎప్పటి నుండో మీరు అనుకుంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గరపడుతుంది. స్థిరాస్తి అమ్మటానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. 
 
సింహం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఖర్చులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్‌వెర్‌టర్ రంగాల వారికి పురోభివృద్ధి. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం. దైవ దర్శనాలు తేలికగా అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
కన్య: తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. మీ సంతానం వివాహ విషయాలపట్ల శ్రద్ధ వహిస్తారు. సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 
 
తుల: తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. మీ సంతానం వివాహ విషయాలపట్ల శ్రద్ధ వహిస్తారు. సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
 
వృశ్చికం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల రాక వలన గృహంలో ఖర్చులు అధికమవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశం చేజార్చుకోవడం మంచిది కాదని గమనించండి. 
 
ధనస్సు: వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. దైవ, పుణ్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. స్త్రీలకు ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామి వ్యాపారాల నుండి విడిపోవడం అన్ని విధాలా ఉత్తమం. 
 
మకరం: బంధుమిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో సదవకాశాలు లభిస్తాయి. అనుకున్న వ్యక్తుల కలయిక అనుకూలించకపోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. 
 
కుంభం: కార్యసాధనలో బాగా శ్రమించాల్సి ఉంటుంది. సందర్భం లేకుండా నవ్వడం వలన కలహాలు ఎదుర్కోవలసివస్తుంది. మిత్రులతో కలిసి ఆకస్మికంగా దూరప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. 
 
మీనం: భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. చేతివృత్తి, వ్యాపారులకు ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఖర్చులు అంతగా లేకున్నా ధనం వ్యయం విషయంలో మెళకువ అవసరం. బంధువుల రాక వలన కొంత అసౌకర్యానికి లోనవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rain forecast: అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్

రాజస్థాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం - కాలి బూడిదైన ఏడుగురు.. క్రాకర్స్ వల్లే?

శీతాకాలానికి బైబై.. తెలంగాణలో పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు

అమరావతిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, బాబుతో భేటీ

ఏపీలో బిల్ గేట్స్.. ఘన స్వాగతం పలికిన నారా లోకేష్- సచివాలయంలో ఏపీ సీఎంతో భేటీ..

అన్నీ చూడండి

లేటెస్ట్

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments