Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం (28-05-2019) దినఫలాలు - స్త్రీలకు తమ మాటే నెగ్గాలనే..

Webdunia
మంగళవారం, 28 మే 2019 (05:49 IST)
మేషం: రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కొంటారు. ప్రముఖులు, స్త్రీలతో మితంగా సంభాషించండి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు, చికాకులు ఎదుర్కొంటారు. దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది.
 
వృషభం: స్త్రీలకు తమ మాటే నెగ్గాలనే పంతం కూడదు. ఏ విషయంలోను ఒంటెత్తుపోకడ మంచిదికాదు. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. బంధువుల ఆకస్మిక రాకతో ఒకింత ఇబ్బందులు తప్పవు. మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు.
 
మిథునం: తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వృత్తిపరంగా ఆదాయాభివృద్ధి, పరిచయాలు విస్తరిస్తాయి. మీ లక్ష్య సాధనకు బాగా కష్టపడాలి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం ఉత్తమం.
 
కర్కాటకం: ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి అనునయంగా చెప్పడం మంచిది. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.
 
సింహం: కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. స్త్రీలకు పనిభారం అధికం. మీ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది.
 
కన్య: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దంపతుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
తుల: వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఊహించని ఖర్చులు చేబదుళ్లు తప్పవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
వృశ్చికం: స్థిరాస్తి అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు, పథకాలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. పెద్దల ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
 
ధనస్సు: వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. వాహనం కొనుగోలుకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చే కాలం. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి.
 
మకరం: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటానికి మరికొంత సమయం పడుతుంది. పీచు, నార, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు ఒక పట్టాన పూర్తి కావు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
 
కుంభం: ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో శ్రద్ధ వహించండి. సంకల్ప బలంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగస్తుల పనిలో ఒత్తిడి, చికాకులు వుంటాయి. ప్రముఖుల కలయికతో ఒక సమస్య నీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
 
మీనం: ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments