Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం (20-08-2018) రాశిఫలాలు - మీరు చేసిన వ్యాఖ్యలు పలు సమస్యలకు...

మేషం: వ్యాపారాభివృద్ధికి ప్రత్యర్ధుల నుండి గట్టిపోటీ ఎదుర్కుంటారు. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు పలు సమస్యలకు దారితీయవచ్చును. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాలలో మెళకువ

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (08:44 IST)
మేషం: వ్యాపారాభివృద్ధికి ప్రత్యర్ధుల నుండి గట్టిపోటీ ఎదుర్కుంటారు. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు పలు సమస్యలకు దారితీయవచ్చును. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఉత్సాహం, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
వృషభం: ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులలో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
మిధునం: వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ప్రధానం. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
కర్కాటకం: పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులతో చికాకులు తప్పవు. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. 
 
సింహం: ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మానస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ యత్నాలకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. 
 
కన్య: రాజకీయాలలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనవసర ప్రసంగం వలన అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ప్రయాణాలలో మెళకువ అవసరం. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చడం వలన మందలింపులు వంటివి ఎదుర్కొనకవలసి వస్తుంది. 
 
తుల: తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని అభిమానించే వారి మనసును కష్ట పెట్టకండి. 
 
వృశ్చికం: వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి గడిస్తారు. మీ పథకాలు, షాపుల అలంకరణ మంచి ఫలితాలిస్తాయి. మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వలన ఆందోళనకు గురవతారు. రాజకీయనాయకులకు విదేశీపర్యటనలు వాయిదా పడుతాయి. దంపతుల మధ్య ఏకీభావం సాధ్యం కాదు.  
 
ధనస్సు:వాదోపవాదాలకు దిగకుండా లౌక్యంగా మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు భాద్యతలు స్వీకరిస్తారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం వీడండి. 
 
మకరం: మిత్రులకు మీ సమస్యలు తెలియజేయడం వలన ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లోపం వలన ఆరోగ్యంల సమస్యలు తలెత్తుతాయి. రుణాలు తీరుస్తారు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
కుంభం: మీ ఉన్నతిని చూచు అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. అకాల భోజనం వలన మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మనోభావాలు బయటకి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు.
 
మీనం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. రుణ విమక్తులు కావడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. కుటుంబ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

లేటెస్ట్

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

తర్వాతి కథనం
Show comments