Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-07-2019 శనివారం దినఫలాలు - ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను తెలివిగా....

Webdunia
శనివారం, 20 జులై 2019 (10:15 IST)
మేషం: మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తులను విశ్వసించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. మీ అవసరాలకు కావలసిన ధనం అతికష్టంమ్మీద సర్దుబాటవుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యవహార ఒప్పందాల్లో మొబమ్మాటం తగదు. 
 
వృషభం: పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. మీ మాటకు గౌరవం, స్పందన లభిస్తాయి. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. అయిన వారు సహకరిస్తారు.
 
మిధునం: ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. సభ్యత్వాలు, పదవుల నుంచి తప్పుకుంటారు. మీ అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. తొందరపాటుతనం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. 
 
కర్కాటకం: దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. మీ పై అభియోగాలు తొలగి పోగలవు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను తెలివిగా సమర్థించుకుంటారు. ఖర్చులు అధికం, పొదుపు చేద్దామన్న మీ ఆలోచన ఫలించదు. వ్యయప్రయాసలతో పనులు పూర్తిచేస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు ఆలస్యంగా సత్ఫలితాలిస్తాయి. 
 
సింహం: ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. కొత్త పథకాలతో కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు. స్త్రీల ప్రతిభకు తగిన అవకాశం లభిస్తుంది.
 
కన్య: భాగస్వామికులకు మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయ సంతృప్తికరంగా ఉంటుంది. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల వ్యవహారంలో అనుభవిజ్ఞల సలహా పాటించండి. రుణయత్నం ఫలించి ధనం అందుతుంది.
 
తుల: ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. బంధువుల ఆకస్మిక రాకఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు, పోటీని దీటుగా ఎదుర్కుంటారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.
 
వృశ్చికం: బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. రాజీమార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. పనులు సాగక, పరిస్థితులు అనుకూలించక విసుగు చెందుతారు. ప్రస్తుత వ్యాపారాలనే కొనసాగించండి. పదవులు, సభ్యత్వాలకు స్వస్తి చెబుతారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
ధనస్సు: ఆర్ధిక విషయాలలో కష్టనష్టాలు సంభవం. వృత్తులలో వారికి చికాకులు, డాక్టర్లకు లాభదాయకం, ఆడిటర్లకు మిశ్రమ ఫలితం. నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
మకరం: ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలు మించుతాయి. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారంతో మీలో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సానుకూలమైన మార్పుతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది. ఒక విషయంలో మిత్రుల తీరు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం: వ్యాపారంలో ఆశించినంత ప్రయోజనాలు సాధించడం కష్టం. కంపెనీలకు అవసరమైన నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ యత్నాలు అనుకూలిస్తాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. లీజు, ఏజెన్సీలు నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-09-2025 సోమవారం ఫలితాలు - పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది...

01-09-2025 నుంచి 30-09-2025 వరకు మీ మాస గోచార ఫలాలు

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

31-08-2025 ఆదివారం రాశిఫలాలు - ఖర్చులు అధికం.. ప్రయోజనకరం...

30-08-2025 శనివారం ఫలితాలు - పిల్లల దూకుడును అదుపు చేయండి.

తర్వాతి కథనం
Show comments