17-07-2019- బుధవారం దినఫలాలు - నిరుద్యోగులలో నూతనోత్సహం...

బుధవారం, 17 జులై 2019 (10:17 IST)
మేషం : ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ జీవితం మీరు కోరుకున్నట్లుగానే ఉంటుంది. 
 
వృషభం : ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలందు పై అధికారుల ఒత్తిడిని ఎదుర్కుంటారు. అకాలభోజనం, శ్రమాధిక్త వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. చిన్నారుల ఆరోగ్యం గురుంచి శ్రద్ద చూపిస్తారు. మీ వ్యవహారాలు సాధ్యమైనంత వరకు మీరే సమీక్షించుకోవడం మంచిది.
 
మిధునం : ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సివస్తుంది. విదేశీ వ్యవహారాల రంగాలకు చెందినవారికి ఆర్థికంగా ప్రోత్సహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు సంబంధించిన అధికారుల సహకారం అందుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహంచండి. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు.
 
కర్కాటకం : శ్రీవారు, శ్రీమతికి సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. సన్నిహితుల గురించి ఆలోచిస్తారు. నిరుద్యోగులలో నూతనోత్సహం చోటుచేసుకుంటుంది. కళా, సాంస్కృతిక, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సహకరంగా ఉంటుంది. రావలసిన ధనం అందుతుంది.
 
సింహం : నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం ఆందోళన కలిగిస్తుంది. కొత్త అంశాలకు స్వీకారం చుడతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దల్చుతాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
 
కన్య : ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారంతో మీలో కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
తుల : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమదాయకం. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు.
 
వృశ్చికం : అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడును. పెద్దలను ప్రముఖులను కలుసు కోగలుగుతారు. ఉద్యోగస్తులు ఓర్పుతో వ్యవహరిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు.
 
ధనస్సు : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు.
 
మకరం : ప్రతి విషయంలోను స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది. ఆకస్మిక ఖర్చులు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ప్రముఖుల కలయిక సంతృప్తి నిస్తుంది. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్ధుల్లో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. కుటుంబంలో పెద్దల ధోరణి చికాకు కలిగిస్తుంది.
 
కుంభం : ఆర్థిక లావాదేవీలకు అనుకూలం. మిత్రులతో మనసు విప్పి మాట్లాడుకుంటారు. గౌరవప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు.
 
మీనం : స్త్రీలు కళాత్మక రంగాల పట్ల బాగుగా రాణిస్తారు. స్పెక్యులేషన్, ఎలక్ట్రానికల్, ఎలక్ట్రికల్ రంగాల వారికి కలిసివచ్చును. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్థిరాస్తి అమర్చుకుంటారు. ప్రముఖులతో కలయిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధిక శ్రమ, ఒత్తిడికి లోనవుతారు. విదేశాలకు చేయు యత్నాలు ఫలించవు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత : టిటిడి ఈవో