Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-07-2019- శనివారం దినఫలాలు - స్త్రీలు అనవసర విషయాల్లో....

Advertiesment
13-07-2019- శనివారం దినఫలాలు - స్త్రీలు అనవసర విషయాల్లో....
, శనివారం, 13 జులై 2019 (10:52 IST)
మేషం: భాగస్వామిక, సొంత వ్యాపారాలల్లో ఏకాగ్రత అవసరం. విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. కిరణా, ఫాన్సీ, నిత్యావసర వస్తు వ్యావారులకు కలిసిరాగలదు. విద్యార్ధునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు.
 
వృషభం: చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు. మనసుని ఉల్లాసంగా చేసుకోండి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిరిగా వ్యయం చేస్తారు.
 
మిధునం: ఎగుమతి వ్యాపారులకు కలిసివచ్చేకాలం. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గులవుతారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన వస్తు సామగ్రి అందజేస్తారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. 
 
కర్కాటకం: ఆర్ధిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఇతరులకు పెద్దమొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. స్వతంత్ర్య నిరుద్యోగులు స్థిరపడే కాలం. 
 
సింహం: పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయానాయకులు సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. నిబద్దత, క్రమశిక్షణతో మీరు కోరుకుంటున్న గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య: ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. ప్రేమికులకు పెద్దల నుంచి ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధు మిత్రుల రాకతో గృహంలో సదడి నెలకొంటుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
తుల: నూతన వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ద వహిస్తారు. ఉన్నతాధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయలలో పెద్దల మాటను శిరసావహిస్తారు. 
 
వృశ్చికం: విద్యార్థులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. మీ విరోధులు వేసే పథకాలు త్రిప్పిగొట్టగలుగుతారు. ప్రేమికుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ప్రియతముల కోసం, సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. 
 
ధనస్సు: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ సంతానం పై చదువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. భాగస్వామ రంగంలో వారికి చికాకులు తలెత్తును. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది.
 
మకరం: దంపతులు మధ్య కలహాలు అధికమవుతాయి. అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. చేపట్టిన పని కొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరగలదు. స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. 
 
కుంభం: వస్త్ర, బంగారం, వెండి, ఫాన్సీ వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. ప్రత్యర్ధులపై విజయం సాధిస్తారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రచయితలకు, పత్రికా రంగాంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది.
 
మీనం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. గృహంలో ఏవన్నా వస్తువులు పోవుటకు ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-7-2019- శుక్రవారం దినఫలాలు - ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో..