Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-10-2018 శనివారం మీ రాశిఫలితాలు.. ఒకరికిచ్చిన హామీ వలన వర్తమానంలో..?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (09:47 IST)
మేషం: పెద్ద ప్రమేయంతో ఆస్తి పంపకాల సమస్య పరిష్కారమవుతుంది. వృత్తులు, ప్రింటింగ్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. 
 
వృషభం: చేపట్టిన స్వయం ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగటంతో పాటు మీ యత్నం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ఉద్యోగస్తులకు అడ్వాన్స్‌లు, బోనస్, సెలవులు మంజూరవుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడుతాయి. కొంతమంది మీపై అభాండాలు వేసే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.     
 
మిధునం: లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. ఉద్యోగస్తులు ఏకాగ్రత లోపం వలన మాటపడవలసి వస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిష్ట్రేనన్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. విదేశాల్లోని అయిన వారి క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి.  
 
కర్కాటకం: వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. కంపెనీ సమావేశాలలో మీకు గతానుభవం ఉపయోగపడుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు.  
 
సింహం: శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యత్నాలకు సన్నిహితుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్లు అందుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. 
 
కన్య: కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య సమావేశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు రచనలు, కళాత్మక పోటీల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. 
 
తుల: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమెుబైల్, మెకానికల్ రంగాలవారికి పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థినుల్లో ఏకాగ్రత లోపం వలన చికాకులు, మందలింపులు తప్పవు. స్త్రీలు బంధువుల నుండి ఒక ముఖ్య సమాచారం గ్రహిస్తారు. పొదుపు చేయాలన్న మీ ఆశయం ఫలించదు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.      
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీ అవసరాలకు సరిపడా ధనం సమకూరుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి.  
 
ధనస్సు: పారిశ్రామిక రంగాలవారికి కార్మికులతో సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఇంటా, బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. మీ అలవాట్లు, మాటతీరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
మకరం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రుణం ఏ కొంతైనా చెల్లించాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అంతగా పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. దైవ దీక్షలు, యోగా, ఆరోగ్య విషయాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది.  
 
కుంభం: కళా, క్రీడా, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. సొంత వ్యాపారులకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. గతంలో ఒకరికిచ్చిన హామీ వలన వర్తమానంలో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు విలాస వస్తువులు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది.  
 
మీనం: వైద్యులకు ఏకాగ్రత అవసరం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేదు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ శ్రమకు, నైపుణ్యతకు యాజమాన్యం నుండి గుర్తింపు లభిస్తుంది. స్థానచలన మార్పిడికై చేయు యత్నంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోకతప్పదు.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments