Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-01-2019 శనివారం దినఫలాలు - మీ సమర్థతపై ఎదుటివారికి...

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (08:48 IST)
మేషం: దైవ, సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాజకీయనాయకుల వలన కావలసిన పనులను చేయించుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. ఉద్యోగ పరంగా స్థానచలనం సంభవించును ధనం బాగా ఖర్చుచేస్తారు. 
 
వృషభం: ఉద్యోగపరంగా ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొన గలుగుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. సోదరీసోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. 
 
మిధునం: మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. 
 
కర్కాటకం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. బంధువులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభయకంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సుల, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.  
 
సింహం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. ప్రయాణాల్లో  అసౌకర్యానికి లోనవుతారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
కన్య: ఆలయాలను సందర్శిస్తారు. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు.   
 
తుల: వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలు మరింత బలపడుతాయి. పారిశ్రామిక రంగాల్లోని వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులు అత్సుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. 
 
వృశ్చికం: మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్సిస్తారు. 
 
ధనస్సు: ఆర్థికంగా బాగుగా స్థిరపడుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడుతారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి.  
 
మకరం: వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కొంతమంది మిమ్ములను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. ఇతర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. వైద్యులకు ఏకాగ్రత అవసరం.    
 
కుంభం: విద్యార్థులు ఇతర వ్యాపకాలు విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందుతారు. ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. నిరుద్యోగులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్త్రీలకు అకాలభోజనం వలన ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు.   
 
మీనం: కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. కంప్యూటర్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. ఆత్మీయుల రాకతో గృహం కళకళలాడుతుంది. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. హోటర్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

తర్వాతి కథనం
Show comments