Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-09-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. మెతకదనం వీడి..?

మేషం: మెుహమ్మాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తే అనుకున్నది సాధ్యమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరు

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (09:26 IST)
మేషం: మెుహమ్మాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తే అనుకున్నది సాధ్యమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
వృషభం: ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. వృత్తుల వారికి స్వల్ప చికాకులు మినహా సమస్యలుండవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు.    
 
మిధునం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడక తప్పదు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ప్రేమికుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
కర్కాటకం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. ప్రముఖుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులు తోటివారి వలన మాటపడక తప్పదు.  
 
సింహం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
కన్య: ఉద్యోగ రీత్యా దూరప్రయాణం చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. చేపట్టిన వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. దైవ, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు.  
 
తుల: తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకులు అధికమైనా సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. బంధువుల రాక వలన చేపట్టిన పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. వాహన యోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. 
 
వృశ్చికం: ఇతరులపై ఆధారపడక మీ వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవడం క్షేమదాయకం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ఊహించని సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు సభలు, సత్కార్యాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. 
 
ధనస్సు: ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన చికాకులు అధికమవుతాయి. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు పనిభారం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సోదరులతో స్వల్ప అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. రుణప్రయత్నం వాయిదా పడగలదు. 
 
మకరం: నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. చేస్తున్న పనులు పూర్తి అవుతున్న చివరి క్షణంలో విసుగు, భారమనిస్తాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న వంతం అధికమవుతుంది. గట్టిగా ప్రయత్నిస్తేనే మెుండి బాకీలు వసూలవుతాయి. రవాణా రంగాలలో వారు చికాకులు ఎదుర్కుంటారు. 
 
కుంభం: వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. స్త్రీలకు టీ. వీ ఛానెళ్ల నుండి ఆహ్వానం అందుతుంది. రెట్టించిన ఉత్సాహంతో కొత్త యత్నాలు మెుదలెడుతారు.  
 
మీనం: దంపతుల మధ్య సఖ్యతలోపం చికాకులు తలెత్తుతాయి. చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా సమర్థించుకుంటారు. సంఘంలో కీర్తి గౌరవాలు ఇనుమడిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు కలిగిరాగలదు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుబారా ఖర్చులు తగ్గకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: మార్చిలో జనసేన ప్లీనరీ.. మూడు రోజులు ఆషామాషీ కాదు.. పవన్‌కు సవాలే...

TTD Chairman : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. జనవరి 10, 11 12 తేదీల్లో రద్దీ వద్దు

మానవత్వం మంటగలిసిపోయింది.. ట్రక్ డ్రైవర్ గాయపడితే.. ఫోన్, డబ్బు దొంగలించేశారు.. (video)

ఇద్దరితో వివాహం, మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన నగల వ్యాపారి

ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారా.. విమానాలు నడుపుతున్నారా? బస్సు మధ్యలో వ్యక్తి.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

01-01-2025 బుధవారం దినఫలితాలు : గృహం సందడిగా ఉంటుంది...

01-01-2025 నుంచి 31-01-2025 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

30-12-2024 సోమవారం దినఫలితాలు : పిల్లల దూకుడు అదుపు చేయండి...

తర్వాతి కథనం
Show comments