Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-01-2019 - శనివారం మీ రాశి ఫలితాలు - సోదరీసోదరుల మధ్య సఖ్యతాలోపం, కలహాలు....

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (09:49 IST)
మేషం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. ఖర్చులు అధికమవుతాయి. పీచు, ఫోమ్, లెదర్, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి. ఉద్యోగస్తుల శ్రమకు అధికారుల నుండి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది.
 
వృషభం: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. సోదరీసోదరుల మధ్య సఖ్యతాలోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. హోటర్, తినుబండారాలు, క్యాటరింగ్, చిరువ్యాపారులకు ఆశాజనకం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి అచ్చుతప్పులు పడడం వలన మాటపడకతప్పదు. 
 
మిధునం: ఆలయాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు, ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. షేర్లు, యూనిట్ల క్రయవిక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమ వారికి ఆశాజనకం. 
 
కర్కాటకం: హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, చిరు వ్యాపారులకు ఆశాజనకం. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఆందోళన అధికమవుతుంది. కార్మిక బాకీలు, పి.ఎఫ్. బాకీలు ఒక కొలిక్కి రాగలవు.  
 
సింహం: కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం వలన ఆందోళనకు గురవుతారు. వాగ్వివాదలకు, అనరసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. 
 
కన్య: ఆధ్యాత్మిక, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు, ప్రైవేటు, పత్రికా సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వాగ్వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం.  
 
తుల: పట్టు, చేనేత, ఫ్యాన్సీ, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి బాకీల వసూలు విషయంలో సమస్యలు తప్పవు. వ్యవసాయ కూలీలు, కార్మికులకు ఆశాజనకం. మిత్రులను ఒక వ్యవహారంలో అతిగా విశ్వసించడం వలన ఆశాభంగానికి గురికాకతప్పదు. 
 
వృశ్చికం: స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదే వేయడం మంచిది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతంగై ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు. స్త్రీల మనోవాంఛలు, యత్నాలు నెరవేరడం వలన వారిలో నూనత ఉత్సాహం చోటు చేసుకుంటుంది. 
 
ధనస్సు: ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించడం వలన ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతంగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఫాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు కలిసిరాగలదు. నిరుద్యోగుల ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి.  
 
మకరం: ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ప్రయాణాలలో వస్తువులు జారవిడుచుకునే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.    
 
కుంభం: పారిశ్రామిక రంగాల్లో వారు స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి సంతృప్తి కానవస్తుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు. బేకరి, తినుబండారాలు వ్యాపారులకు లాభదాయకం. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయడం మంచిది.  
 
మీనం: గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలవారికి కార్మికులతోను, అధికారులతోను చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యుల రాకపోకల వలన అనుకోని ఖర్చులు అధికమవుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Kamika Ekadashi: కామిక ఏకాదశి: శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తే.. లక్ష్మీదేవిని పూజిస్తే?

Kamika Ekadashi 2025: కామిక ఏకాదశిని మిస్ చేసుకోకండి.. తులసీ ముందు నేతి దీపం వెలిగిస్తే?

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

తర్వాతి కథనం
Show comments