Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-06-2019 మంగళవారం రాశి ఫలితాలు.. అనవసరపు ఆలోచనలు వద్దు..

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (10:42 IST)
మేషం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. మీ మాటతీరు, పద్ధతులను మార్చుకోవాల్సి వుంటుంది. అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. 
 
వృషభం: స్త్రీలకు మిత్రుల ధోరణి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. పాత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెరిగిన కుటుంబ అవసరాలు, రాబడికి మించిన ఖర్చుల నల్ల ఆటుపోట్లు తప్పవు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండదు. 
 
మిథునం: సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగును. కొన్ని విషయాల్లో ఓర్పును కోల్పోతారు. మిత్రులతో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం. చికాకులను ఎదుర్కొంటారు. మీ కళత్ర మొండి వైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. నూనె, ఎండుమిర్చి వ్యాపారులకు అనుకూలంగా వుండగలదు. 
 
కర్కాటకం: రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి నూతన వెంచర్ల పట్ల ఆసక్తి అంతగా వుండదు. టెక్నిక్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరించుకోగలుగుతారు. 
 
సింహం: ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కుటుంబంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. స్త్రీల సృజనాత్మకతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కన్య: బ్యాకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్త్రీలు వాహనం నడుపునప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా అందరితో సంతోషంగా మెలగండి. ఆదాయపు లెక్కలు, తేడాలు అప్పటికప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. 
 
తుల: స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం: దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలనే పట్టుదల అధికమవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు నూతన పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. వైద్యులు శస్త్ర చికిత్స చేయునప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. 
 
ధనస్సు: ఆర్థికింగా బాగుగా పురోభివృద్ధి చెందుతారు. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. మీ శ్రీమతి సహకారంతో కొన్ని సమస్యలు కూడా సానుకూలమవుతాయి. 
 
మకరం: స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో కొనసాగుతాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. గతంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశం వుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా  పడతాయి. 
 
కుంభం: ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాట పడక తప్పదు. దైవ సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి 
 
మీనం: ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నం వాయిదా పడటం మంచిది. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలతో ఏకాగ్రత అవసరం. సభలు, సమావేశాల్లో ధనం అధికంగా వ్యయం చేస్తారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై పగ... నిద్రిస్తున్న మహిళలపై తలపై కొట్టి పారిపోయే కిరాతకుడు...

పవన్ కళ్యాణ్‌కు ఊరట.. క్రిమినల్ కేసును ఎత్తివేత!

మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన తండ్రిని చూసిన కుమార్తెలు.. ఏం చేశారంటే?

పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ.. అరెస్టు తప్పదా?

అమరావతి నిర్మాణం - జంగిల్ క్లియరెన్స్.. పనులు ప్రారంభం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11-2024 శనివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగించండి...

హనుమంతుడి వడమాలకు.. రాహువుకు, శనికి ఏంటి సంబంధం?.. జిలేబి?

15-11-2024 శుక్రవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు...

వాస్తు దోషాలు, గ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే..?

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

తర్వాతి కథనం
Show comments