Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-06-2019 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించినా జయం

Advertiesment
10-06-2019 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించినా జయం
, సోమవారం, 10 జూన్ 2019 (10:13 IST)
మేషం : మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. విదేశాలకు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. మొండి బాకీలు వసూలు కాగలవు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. 
 
వృషభం : రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు సంపాదన మార్గాలు అన్వేషిస్తారు. క్రయ విక్రయ రంగాల్లో వారికి సంతృప్తి కానరాగలదు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ముఖ్యుల రాకఆనందం కలిగిస్తుంది. 
 
మిథునం : వస్త్ర, బంగారు, వెండి లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. స్త్రీలు అందరియందు కలుపుగోలుతనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పదవీ విరమణ చేసిన వారికి రావలసిన గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. 
 
కర్కాటకం : వస్త్ర, బంగారు, వెండి లోహ వ్యాపారస్తుకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. రావలసిన బకాయిలు వాయిదా పడతాయి. క్రీడా రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. 
 
సింహం : సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారాలకు పురోభివృద్ధి. నూతన దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. స్త్రీలకు ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తవు. 
 
కన్య : ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బంధుమిత్రుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు. పత్రికా సంస్థల్లోనివారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
తుల : ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. 
 
వృశ్చికం : విద్యుత్, ఏసీ, మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవల్ల మాట పడవలసి వస్తుంది. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకుల కలిగిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వ్యాపారాభివృద్ధికే చేయు కృషిలో పోటీ అధికమవ్వడంతో ఆందోళన తప్పదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. 
 
మకరం : పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో వారికి కొన్ని సమస్యలు తీరుతాయి. ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఏ పనియందు ధ్యాస ఉండదు. రాజకీయ నాయకులు తరుచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
కుంభం : ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేని గ్రహించండి. ఖర్చులు అధికమువతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం తగదు. 
 
మీనం : వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు తలెత్తవచ్చును. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలే జరుగుతుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత మొండిబాకీలు వసూలవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-06-2019 మీ రాశిఫలాలు : విద్యార్థులు ఇతరుల కారణంగా...