Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-02-2019 సోమవారం దినఫలాలు - సంతానం పట్ల... ఆరోగ్యంపై...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (08:51 IST)
మేషం: కిరణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆశాజనకం. మీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మీ కళత్ర ఆరోగ్యం మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రైవేటు విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికం. మీ పనులు మందకొడిగా సాగడం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు.
 
వృషభం: స్థిరాస్తి, క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకం. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళకువ వహించండి. 
 
మిధునం: బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో నాణ్యత లోపం వలన నష్టాలు చవిచూడవలసి వస్తుంది. పాతమిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. 
 
కర్కాటకం: ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల బదిలీ యత్నాలకు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు. స్త్రీలకు చీటికి మాటికి అసహానం, నిరుత్సాహం వంటి చికాకులు తప్పవు.  
 
సింహం: కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వలన మాటపడవలసి వస్తుంది. మీ దైందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు.  
 
కన్య: సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఓర్పు, నేర్పు వ్యవహరించవలసి వస్తుంది. వీసా, పాస్ పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు.   
 
తుల: బంధుమిత్రుల రాకతో దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.  
 
వృశ్చికం: విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత అవసరం. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకు పాత రుణాలు తీర్చుతారు. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.  
 
ధనస్సు: మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఖర్చులు అదుపు కోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. స్త్రీలకు బంధువుల తాకిడి వలన ఒత్తిడి, పనిభారం తప్పవు.  
 
మకరం: రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడుట వలన ఆందోళనకు గురవుతారు. ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సోదరీసోదరుల మధ్య అవగాహన కుదురుతుంది.    
 
కుంభం: ఉద్యోగస్తులు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కార్యసాధనలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి. ప్రేమికులకు పెద్దల నుండి విమర్శలను ఎదుర్కుంటారు.   
 
మీనం: ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. బ్యాంకు వ్యవహారాలలోని పనులు చురుకుగా సాగుతాయి. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments