Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-02-2019 ఆదివారం దినఫలాలు - పట్టుదలతో శ్రమించిన గానీ...

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (09:38 IST)
మేషం: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థికలావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. రావలసిన ధం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృషభం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో శ్రమించిన గానీ అనుకున్నది సాధ్యం కాదు. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. బంధుమిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. 
 
మిధునం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. గృహ మరమ్మత్తులు, నిర్మాణాలు వాయిదాపడుతాయి. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కుటుంబీకుల మధ్య అవగాహన అంతగా ఉండదు. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం.  
 
కర్కాటకం: స్థిరచరాస్తుల వ్యవహారాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు పురోభివృద్ధఇ. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి.   
 
సింహం: రేపటి నుండి ఆలోచనలు సాగిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. కొంతమంది మీ వ్యాఖ్యాలను అపార్థం చేసుకుంటారు. ఎంతో శ్రమించిన గానీ అనుకున్న పనులు పూర్తికావు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.  
 
కన్య: ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రత్యర్థులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చలన్న మీ లక్ష్యం నెరవేరుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు.   
 
తుల: రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం: బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మీ ఏమరుపాటుతనం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. 
 
ధనస్సు: షాపులలో పనిచేసే వారిలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ సంతానం అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. స్వయంకృషితోనే పనులు సానుకూలమవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. 
 
మకరం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆత్మీయుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్పురిస్తాయి.     
 
కుంభం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ధనం చేతిలో నిలబడడం కష్టమే. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.   
 
మీనం: వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం ఉంది. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. విందుల్లో పరిమితి పాటించండి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Male Dwakra: మహిళలకే కాదు.. ఇక పురుషులకు కూడా డ్వాక్రా.. ఏపీ సర్కార్

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments