05-02-2019 మంగళవారం దినఫలాలు - దైవదర్శనం వలన మానసిక...

మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (08:58 IST)
మేషం: ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. చెల్లింపులు వాయిదా వేస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా దుబారా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. దైవదర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
వృషభం: స్నేహితులు మీ జీవితానికి మూల స్థంభాలుగా మారుతారు. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించడం క్షేమదాయకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఎదురయ్యే ప్రతి విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. గృహోపకరణాలు అమర్చుకుంటారు. 
 
మిధునం: మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా తాత్కాలికమేనని గమనించండి. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడుతారు. నిర్మాణ పనులు, మరమ్మత్తులలో ఏకాగ్రత వహించండి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
కర్కాటకం: రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలు ఆదాయంపై, ధన సంపాదనపై మరింత దృష్టి పెడతారు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచండి.  
 
సింహం: స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ, సహకారాలు అందిస్తారు. 
 
కన్య: వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది.  
 
తుల: మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. ఆలయాలను సందర్శిస్తారు. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. ప్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.  
 
వృశ్చికం: ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు సంతానం, పనివారలతో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ప్రేమికుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచి ఆసయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.  
 
ధనస్సు: వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కుంటారు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన సత్ఫలితాలు పొందగలరు. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.  
 
మకరం: కొబ్బరి, పండ్లు, పూలు చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వలన ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఆదాయ, వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ తల్లి, తండ్రి పేరుతో దానధర్మాలు చేయడం వలన మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.    
 
కుంభం: కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాలలో వారికి లాభదాయకం. రాజకీయాలలో వారికి రహస్యపు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మిత్రుల కలయికతో మనసు కుదుటపడుతుంది. టెక్నికల్, స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు.   
 
మీనం: ఉద్యోగస్తులు తరచు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడడం మంచిది. నూతన ఒప్పందాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సోమనాథ జ్యోతిర్లింగం ఎలా ఉద్భవించిందో తెలుసా?