Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-04-2019 మంగళవారం దినఫలాలు - మేష రాశివారు ఇలా చేస్తే...

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (09:02 IST)
మేషం: ఏమైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. విదేశీ యత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు.
 
వృషభం: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల వలన ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. విజ్ఞతతో వ్యవహరించి రుణదాతలను సమాధానపరుస్తారు. కొంతమంది మీ నుండి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి ధోరణి చికాకుపరుస్తుంది.
 
మిధునం: ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్లీడరు నోటీసులకు దీటుగా స్పందిస్తారు. దూరప్రయాణాలలో పరిచయాలు ఏర్పడుతాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం: పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలించవు. అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం పడిగాపులు తప్పవు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపవం వలన అలసట అధికమవుతుంది.
 
సింహం: విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లలో విజయం సాధిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన అగ్రిమెంట్లు వాయిదా వెయ్యండి. కొత్త పరిచయాల వలన వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి. వాదోపవాదాలకు దిగకుండా లౌక్యంగా మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవలసి ఉంటుంది.
 
కన్య: దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వలన మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. నేడు అనుకూలించని వ్యవహారం రేపు సానుకూలం కాగలదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల: రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి. వ్యాపారాలు అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండడం వలన మేలు చేకూరుతుంది. కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు.
 
వృశ్చికం: దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన మొండిబాకీలు సైతం వసూలవుతాయి. ప్లీడరు నోటీసులకు దీటుగా స్పందిస్తారు. వాహనం నిదానంగా నడపండి. అధికారుల హోదా పెరగటంతో పాటు స్థానచలనం ఉంటుంది. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ సన్నగిల్లుతుంది. 
 
ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. గృహ ప్రశాంతతం మీ చేతుల్లోనే ఉందని గమనించండి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. 
 
మకరం: కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. కొంతమంది మీ నుండి పెద్ద మొత్తంలో ధనసహాం అర్థిస్తారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
కుంభం: ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. అనుకూలతలున్నా మీ యత్నాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. 
 
మీనం: కోర్టు వ్యవహారాలు అనుకున్న విధంగా సమయానికి పూర్తికాగలవు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వలన పై అధికారులతో మాటపడవలసివస్తుంది. దైవదర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

లేటెస్ట్

మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగిస్తే?

11-02-2025 మంగళవారం రాశిఫలాలు - త్వరలోనే రుణవిముక్తులవుతారు...

Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?

ఫిబ్రవరి 12న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ.. భక్తుల రద్దీ

ప్రదోష కాలంలో తులసి, కొబ్బరి నీళ్లు శివునికి ఇవ్వకూడదట!

తర్వాతి కథనం
Show comments