Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-03-2019 - శనివారం మీ రాశి ఫలితాలు..

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (10:19 IST)
మేషం: స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. విదేశీయానానికి కావలసిన పాస్‌పోర్టు, వీసాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. సొంతంగా గృహం ఏర్పచుకోవాలనే కోరికి బలీయమవుతుంది. మీ జీవిత భాగస్వామి మాటాలను తేలికగా కొట్టివేయడం మంచిదికాదు.
 
వృషభం: ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. చేస్తున్న పనులు పూర్తి అవుతున్న చివరి క్షణంలో విసుగు, భారమనిపిస్తాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. మీ ఆశయాలు, అఛిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి.
 
మిధునం: కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. రుణ చెల్లింపులు వాయిదా పడుతాయి. స్త్రీలు తమ సరదాలు, కోరిక వాయిదా వేసుకుంటారు. చిన్నారు, ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. ఉమ్మడి, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
కర్కాటకం: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వ్యాపారులకు బాగా కలిసిరాగలదు. ప్రయాణాల ముఖ్యోద్దేశ్యం నెరవేరుతుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి తగిన అవకాశం లభిస్తుంది. ఓర్పు, రాజీ ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
సింహం: ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇబ్బందులుండవు. దంపతులకు ఒక్క క్షణం కూడా సఖ్యత ఉండదు. సొంత వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయడం శ్రేయస్కరం. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. 
 
కన్య: బంధువుల రాక, ఆకస్మిక ఖర్చుల వలన కొంత అసౌకర్యానికి లోనవుతారు. మీ అభిప్రాయాలకు ఆశించినంత స్పందన ఉండదు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వలన మోసపోయే ఆస్కారం ఉంది. మీరు అభిమానించే వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక వలన ఎంతో కొంత మేలు జరుగుతుంది. 
 
తుల: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి.
 
వృశ్చికం: ప్రింటింగ్ రంగాల వారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. ఏమరుపాటుగా వాహనం నడపడం వలన ఊహించని చికాకులు తలెత్తుతాయి. 
 
ధనస్సు: రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, పానీయ వ్యాపారులకు లాభదాయకం. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఇబ్బంది కలిగిస్తాయి.  
 
మకరం: ఉద్యోగస్తులకు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తిచేయ గల్గుతారు. ఒక స్థిరాస్తి విక్రయంలో సమస్యలెదుర్కుంటారు. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. రావలసిన ధనం అందకపోవడంతో ఆందోళన చెందుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
కుంభం: కోర్టు వ్యవహారాల్లో మెళకువ వహించండి. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బాకీళ వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటి పైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు పనిభారం అధికం. ధనం ఏ మాత్రం నిల్వచేయలేకపోతారు. 
 
మీనం: భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాల్లో  ఏకాగ్రత అవసరం. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. పారిశ్రామిక రంగాలలోని వారికి కార్మిక సమస్యలు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

తర్వాతి కథనం
Show comments