Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-01-2020 గురువారం దినఫలాలు- రాఘవేంద్ర స్వామిని పూజించినా.. .

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (05:00 IST)
మేషం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశతప్పదు. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. రిప్రజెంటివ్‌లకు, ప్రైవేట్ సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. 
 
వృషభం : ప్రియతములతో షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక, రంగుల వ్యాపారులకు మిశ్రమ ఫలితం. దైవ, సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. 
 
మిథునం : పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ కార్యక్రమాలు, ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. నిత్యావసర వస్తుస్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. విదేశీ పర్యటన ఏర్పాటు ముమ్మరంకాగలవు. 
 
కర్కాటకం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారు అచ్చుతప్పులు పడుటవల్ల మాటపడాల్సి వస్తుంది. కాంట్రాక్టర్ల అతికష్టంమ్మీద టెండర్లు చేజిక్కించుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోటల్, తినుబండరాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. విద్యార్థినులకు ఏకాగ్రత లోపం వల్ల ఆందోళన తప్పదు. 
 
సింహం : శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. బిల్లులు చెల్లిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పట్టుదలతో కార్యసాధనకు మరోసారి యత్నిస్తారు. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. 
 
కన్య : వస్త్ర వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు ఆటంకాలు, జాప్యం తప్పవు. కళ, క్రీడా, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. ఖర్చులు అధికమవుతాయి. గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. ఇతరులను ధనసహాయం అడగటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. 
 
తుల : ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవల్ల మాటపడవలసి వస్తుంది. ఖర్చులకు వెరవక ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. పనిలో మీ నిపుణతకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోడ్పడతాయి. కొంతమంది మిమ్మలను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
ధనస్సు : నూతన వ్యక్తుల పరిచయం వల్ల ఊహించని పరిణామాలను ఎదుర్కొంటారు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలను తెచ్చుకోకండి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిలువు చేయలేక పోతారు. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. 
 
మకరం : కాంట్రాక్టర్లు, మధ్యాహ్నభోజన పథక ఏజెంట్లకు బిల్లులు మంజూరుకాగలవు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి పెరుగుతుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. దూరప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. 
 
కుంభం : ఉద్యోగస్తులకు అధికారులు తోటివారి ప్రశంసలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఏ పని సక్రమంగా సాగక నిరుత్సాహం చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. 
 
మీనం : విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు వాయిదాపడతాయి. వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలు మరింత బలపడతాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments