01-07-2019 సోమవారం మీ రాశిఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయిస్తే...

Webdunia
సోమవారం, 1 జులై 2019 (09:07 IST)
మేషం : కళా, సాంస్కృతిక, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బిల్లులు చెల్లిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. 
 
వృషభం : ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. సహోద్యోగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి. రావలసి ధనం చేతికందడంతో మీలో పలు ఆలోచలు చోటుచేసుకుంటాయి. తెలివి తేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. 
 
మిథునం : ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహనకు వస్తారు. వడ్డీలు, డిపాజిట్లు ఆదుకుంటారు. భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. పెద్దల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. మిమ్మిల్ని మీరే తక్కువ వేసే వారు మీ సహాయం అర్థిస్తారు. ఫీజులు చెల్లిస్తారు. శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. 
 
సింహం : విద్యార్థుల్లో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు మందలింపులు తప్పవు. నిరుద్యోగులలో ఉద్యోగావకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. మీ సంతానం కోసం ధనం విరిగా ఖర్చు చేస్తారు. పాత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. 
 
కన్య : వస్త్రాలు, ఆభరణాలు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. పెన్షన్, బీమా పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. వ్యవసాయ రంగాల వారికి విత్తనాల కొనుగోలు విషయంలో మెళకువ అవసరం. 
 
తుల : పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రత్యర్థుల కదలిక పట్ల ఓ కన్నేసి ఉంచండి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రకటనలు, న్యాయ, బోధనారంగాల వారికి అనుకూలం. గృహావసరాలకు నిధులు సమకూరుతాయి. బంధువులను కలుసుకుంటారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలిసి వస్తుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించడి. పెంపుడు జంతువుల విషయంలో అప్రమత్త అవసరం. మీ మాటకు సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నాలు చేస్తారు. 
 
ధనస్సు : ముఖ్యంగా ప్రింటింగ్, మీడియాలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలు మించుతాయి. 
 
మకరం : సోదరీ సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారమవుతాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడుతారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
కుంభం : స్త్రీలకు సంభాషించేటపుడు సంయమనం పాటించండి. స్పెక్యులేషన్, పోటీల్లో నష్టం సంభవం. ప్రత్యర్థులు మీ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వంటి శుభవార్తలు అందుతాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. 
 
మీనం : విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరదు. తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమదాయకం కాదు. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments