Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-03-2018 మంగళవారం మీ రాశి ఫలితాలు.. దంపతుల మధ్య..?

మేషం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఇన్వర్టర్, ఏసీ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారుతారు. నేడు

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (06:24 IST)
మేషం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఇన్వర్టర్, ఏసీ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారుతారు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. రవాణా రంగాల్లోని వారికి మెళకువ అవసరం. 
 
వృషభం: మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. కోళ్ళ, మత్స్య రంగాల్లో వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
మిథునం: కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆందోళన అధికమవుతుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయాల్లో వారు మార్పులను కోరుకుంటారు. కళలు, ఫోటోగ్రఫీ, ఉన్నత విద్య, రంగాల వారికి అనుకూలమైన సమయం. 
 
కర్కాటకం: ఆర్థిక సమస్యల నుంచి బయటపెడతారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. సాహిత్య వేత్తలకు ప్రత్యేక గుర్తింపు లభించును. స్త్రీలు ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించడం మంచిది. కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లనీ పానీయ, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం.  
 
సింహం: ఆదాయం పెంచుకునేందుకు చేసే సఫలీకృతులవుతారు. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, వ్యాపారులకు కలిసిరాగలదు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంక్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. మీ కుటుంబీకుల ఆరోగ్యంలో మెలకువ వహించండి. 
 
కన్య: ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.  
 
తుల : మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ, కళారంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కంది, మిర్చి, పసుపు, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. 
 
వృశ్చికం: ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. లీజు, ఏజెన్సీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. 
 
ధనస్సు: కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు, మీకు అభిమానుల్ని సంపాదించిపెడుతుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బిల్లులు చెల్లిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
మకరం: ఆర్థిక ఒడిదుడుకులు తొలగిపోతాయి. వ్యాపారాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. సోదరీ, సోదరుల మధ్య చిన్న చిన్న కలహాలు, అభిప్రాయ భేదాలు తప్పవు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
కుంభం: వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. స్థిరాస్తి అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ, శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఓర్పు, నేర్పు చాలా అవసరం.
 
మీనం : ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాను పాటించడం మంచిది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉఫాధి పథకాల దిశగా నిరుద్యోగుల ఆలోచనలు వుంటాయి. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments