Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-03-2018 గురువారం మీ రాశి ఫలితాలు... ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా?

మేషం: పారిశ్రామిక రంగం వారికి ఊహించని చికాకులెదురవుతాయి. రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో వుంచుకోవడ

Advertiesment
22-03-2018 గురువారం మీ రాశి ఫలితాలు... ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా?
, గురువారం, 22 మార్చి 2018 (06:37 IST)
మేషం: పారిశ్రామిక రంగం వారికి ఊహించని చికాకులెదురవుతాయి. రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. 
 
వృషభం: ఆర్థికలావాదేవీలు, ఇతరత్రా ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించకపోవడంతో ఆందోళనకు గురవుతారు. ఊహించని ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరుగుతాయి. 
 
మిథునం: ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. తెలివితేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ముఖ్యుల రాకపోకలు పెరుగుతాయి. వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. 
 
సింహం: వస్త్ర, పీచు, కళంకారి, బంగారు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వచేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు మెళకువ అవసరం. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
కన్య: ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి వుండజాలదు. వాహనచోదకులకు ఆటంకాలు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తలెత్తగలవు. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. వ్యాపారంలో కొంతమంది తప్పుదోవ పట్టిస్తారు. జాగ్రత్త వహించండి. కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు.
 
తుల: కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. చీటికిమాటికి ఎదుటివారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం.
 
వృశ్చికం: శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. వృత్తి, ఉద్యోగస్తులకు చికాకులు తప్పవు. బంధువుల రాకపోకలు అధికంగా వుంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలు తలెత్తుతాయి. వాహనం నడిపేటప్పుడు మెళకువ అవసరం. 
 
ధనస్సు: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దూరం ఇష్టం లేకున్నా కొన్ని విషయాల్లో సర్దుకుపోవలసి వస్తుంది. నిరుద్యోగులు, అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి.
 
మకరం: దంపతుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. 
 
కుంభం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానస్తుంది. దైవకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. ఒక శుభకార్యానికి హాజరు కాకపోవడం వల్ల సన్నిహితుల నుంచి అసంతృప్తి ఎదురవుతుంది. రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
మీనం: కీలకమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ అవసరం. హోటల్, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, పనివారలతో సమస్యలు ఎదుర్కోక తప్పదు. పెద్దల ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం (21-03-18) దినఫలాలు : తల, పొట్టకి సంబంధించి...