Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోమవారం (19-03-18) దినఫలాలు : అవివాహితుల్లో...

మేషం : కోర్టు వ్యాజ్యాలు ఉపసంహరించుకుంటారు. మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. మీ ప్రయాణాలు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. సంఘంలో మీ పేరు ప్ర

webdunia
సోమవారం, 19 మార్చి 2018 (08:42 IST)
మేషం : కోర్టు వ్యాజ్యాలు ఉపసంహరించుకుంటారు. మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. మీ ప్రయాణాలు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ముఖ్యం.
 
వృషభం : వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. ఆత్మీయుల నడుమ కానుకలిచ్చి పుచ్చుకుంటారు. అవివాహితుల్లో నూతనోత్సాహం, అనుభూతి చోటుచేసుకుంటాయి. షేర్ల క్రయ విక్రయాలు, స్థికాస్తుల కొనుగోళ్లకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాలతో క్షణం తీరిక ఉండదు.
 
మిథునం : కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల విషయంలో మీ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.
 
కర్కాటకం : సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మనుష్యుల మనస్తత్వము తెలిసి మసలుకొనుట మంచిది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయత్న పూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
సింహం : ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా ఉండాలి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్థులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది.
 
కన్య : కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. మీ సంతానం వైఖరి వల్ల స్వల్ప చికాకు లెదుర్కొంటారు. మొండి బకాయిలు సైతం వసూలు కాగలవు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో అవసరం. స్త్రీలకు ఎదుటివారి విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
తుల : ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సానుకూల ధోరణితో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఖర్చులు అధికమవుతాయి.
 
వృశ్చికం : విద్యార్ధులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు.
 
ధనస్సు : మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచండి. ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
మకరం : మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచండి. ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
కుంభం : ఆర్థికలావాదేవీలు, వ్యాపార ఒప్పందాలకు అనుకూలం. అధ్యాపకులకు పురోభివృద్ధి, విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. రుణం ఏ కొంతైనా చెల్లించాలన్న మీ యత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులే లాభపడతారు. కోర్టు పనుల్లో ప్లీడరుకు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.
 
మీనం : స్త్రీలు ఉద్యోగ, ఆర్జిత ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబ, ఆస్తి పంపకాల వివాదాలు కొలిక్కి రాగలవు. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

ఉగాది పంచాంగం: ఈ ఏడాది కష్టాలే.. ఎండలు-వర్షాలు రెండూ ఎక్కువే