బుధవారం (21-03-18) దినఫలాలు : తల, పొట్టకి సంబంధించి...

మేషం : మీ సంతానం కోసం విలువైన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. బ్యాంకింగ్ రంగాలవారికి ఒ

బుధవారం, 21 మార్చి 2018 (08:38 IST)
మేషం : మీ సంతానం కోసం విలువైన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. బ్యాంకింగ్ రంగాలవారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. 
 
వృషభం : ఉద్యోగస్తులకు తోటివారి నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. బంధువుల రాకవల్ల గృహంలో ఖర్చులు అధికమవుతాయి. వ్యాపార వర్గాలవారికి పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదావకాశాలు లభిస్తాయి. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు పాల్గొంటారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం : బంధువుల రాకవల్ల గృహంలో సందడికానవస్తుంది. సొంతంగా గానీ, భాగస్వామ్యంగా గానీ, చేసిన వ్యాపారాలు కలిసివస్తాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. సోదరీ, సోదరులు, సన్నిహితులకు సంబంధించిన ఖర్చులు అధికమవుతాయి. 
 
సింహం : రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుట మంచిది. మనుష్యుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. 
 
కన్య : ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. తల, పొట్టకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారాలకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. 
 
తుల : ప్రయత్నపూర్వకంగా ఒక అవకాశం కలిసివస్తుంది. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థినిలు లక్ష్య సాధన కోసం మరింతగా శ్రమించాలి. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. కొంతమంది మీ గురించి చాటుగా విమర్శలు చేసే ఆస్కారం ఉంది. దుబారా ఖర్చులు అధికం. 
 
వృశ్చికం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారు అచ్చు తప్పులు పడుటవల్ల మాటపడవలసి వస్తుంది. రావలసిన ధనం అందటం వల్ల మీ అవసరాలు తీరుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ పొదుపరితనం కుటుంబీకులకు చికాకు కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : స్త్రీలకు ఆరోగ్యపరంగానూ, ఇతరాత్రా సమస్యలెదుర్కోవలసి వస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. వైద్యులకు ఆపరేషన్ల సమయంలో ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. గృహోపకరణాలపట్ల మక్కువ పెరుగుతుంది. 
 
మకరం : వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించడి. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ ప్రత్యర్థుల తీరును ఓ కంట కనిపెట్టడం మంచిది. ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. 
 
కుంభం : ఇతరుల విషయాలలో తలదూర్చడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఖర్చులు రాబడికి తగినట్టుగానే ఉంటాయి. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. బంధు మిత్రుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి తప్పదు. 
 
మీనం : పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. తీర్థయాత్రలు, విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి లోనవుతారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శ్రీరామ నవమి ఎప్పుడు?... 25న లేక 26వ తేదీనా?