Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవకపోతే.. ఏమౌతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:07 IST)
Lights
బ్రహ్మ ముహూర్త కాలంలో దీపాలను వెలిగించడం ద్వారా ఏర్పడే ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం.. బ్రహ్మ ముహూర్తకాలంలో దీపం వెలిగించి పూజ చేయడం ద్వారా అప్పుల బాధ అంటూ వుండదు. కార్య విఘ్నాలు తొలగిపోతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. బ్రహ్మ ముహూర్త కాలం అంటే ఉదయం 3.30 గంటల నుంచి ఆరు గంటల వరకు. ఆ సమయంలో నిద్రలేచి, స్నానమాచరించి.. పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
 
ఇంకా ఆ సమయంలో విద్యార్థులు చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలు, పితృదేవతలు మన ఇంటికి వస్తారని విశ్వాసం. ఆ సమయంలో వారిని స్వాగతించకుండా నిద్రపోవడం ద్వారా వారు మన ఇంట వసించరని చెప్తుంటారు. అందుకే రోజు బ్రహ్మ ముహూర్తకాలంలో నిద్రలేచి.. స్నానమాచరించి విభూతిని నుదుట ధరించి.. భగవంతుడిని స్మరిస్తే.. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ద్వారా సూర్య నమస్కారం కూడా చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
బ్రహ్మముహూర్తంలో బియ్యం పిండితో వాకిట్లో ముగ్గు వేయడం అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే దీపారాధన చేయడం మంచిది. బ్రహ్మముహూర్తంలో శివ పంచాక్షరీతో ప్రార్థన చేయొచ్చు. దీంతో గృహంలో పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఈతిబాధలు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments