Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

సెల్వి
సోమవారం, 21 జులై 2025 (22:01 IST)
Lord Shiva
భౌమ ప్రదోషం నాడు శివుడిని పూజించడంతో పాటు వ్రతం పాటించడం ద్వారా జన్మ జాతకంలో మంగళ దోషం (కుజదోషం) తీవ్రతను తగ్గించుకోవచ్చు. పాపాలు హరించుకుపోతాయి. మోక్షం సిద్ధిస్తుంది. ఆర్థిక, ఉద్యోగ సంబంధిత సమస్యలను పరిష్కరించబడతాయి. ప్రదోషాన్ని నెలలో రెండుసార్లు జరుపుకుంటారు. ఈసారి జూలై 22, 2025న భౌమ ప్రదోషం వస్తోంది. 
 
మంగళవారం నాడు ప్రదోషం వస్తే, దానిని భౌమ ప్రదోషం అంటారు. ఈ రోజున శివాలయాల్లో నందీశ్వరునికి, ఈశ్వరునికి ప్రత్యేక అభిషేకాదులు జరుగుతాయి. మంగళవారం నాడు వచ్చే ప్రదోషాన్ని రుణ విమోచన ప్రదోషం అని కూడా అంటారు. 'రుణం' అంటే అప్పులు 'విమోచన' అంటే ఉపశమనం కలుగుతుంది. అందువల్ల, రుణ విమోచన ప్రదోషం నాడు శివుడిని పూజించడం వల్ల ప్రతికూల రుణ కర్మలు తొలగిపోతాయి. 
 
జీవితంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. అప్పులు, భయం, దుఃఖం, కుటుంబ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దేవాలయాలు, ఇళ్లలో ప్రదోష సమయంలో (సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు) శివపూజ చేయడం మంచిది. 
 
వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం భౌమ ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. భౌమ ప్రదోషం రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్ర వచనం.
 
సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి. ఆ తర్వాత శివునికి భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. చివరగా "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

దసరా విక్రయాలు : 2 రోజుల్లో రూ.419 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు

ఏపీ, కర్ణాటక ఐటీ మంత్రుల మాటల యుద్ధం.. నారా లోకేష్ వర్సెస్ ఖర్గే కౌంటర్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

Bathukamma: తెలంగాణలో పూల బతుకమ్మతో ముగిసిన బతుకమ్మ పండుగ

తర్వాతి కథనం
Show comments