ఆషాఢ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి లేదా కామదా ఏకాదశి అంటారు. మనసులోని కోరికలను నెరవేర్చే ఏకాదశి కాబట్టి కామిక ఏకాదశి లేదా కామదా ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు.
శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇప్పుడు తులసీ దళాలతో, పసుపు రంగు పువ్వులను సమర్పించాలి.
ఈరోజు వీలైనంత సేపు శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోతర శతనామావళి వంటివవి పారాయణం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజు విష్ణుమూర్తిని వెన్నని నైవేద్యంగా పెట్టి.. దాన్ని అందరికీ ప్రసాదంగా పెడితే చాలా మంచిది.
ఈరోజు అన్నదానం చేయడం కూడా కోరికలు సిద్ధస్తాయని చెబుతారు. ఈ కామిక ఏకాదశి రోజున శంఖ, చక్రధరుడైన శ్రీ మహా విష్ణువును లక్ష్మీదేవి సమేతంగా పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది.