ఉసిరి కాయను రాత్రిపూట తింటే..?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (16:41 IST)
ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం వుంది. ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది. అందుకే సూర్యునికి ప్రీతికరమైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది. ఈ కారణంగానే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు. అంతేగాకుండా రాత్రి సమయంలో ఉసిరిని తీసుకోకూడదు.  ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. 
 
ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు. అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాం. 
 
అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు. కానీ సోమవారం, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఏకాదశి రోజున ఉసిరికాయతో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా వుంటారని ఆయుర్వేద, ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్‌ చెంప ఛెళ్లుమనిపించిన దండగుడు (వీడియో)

ప్రపంచంలో అతిపెద్ద మూడో స్టార్టప్ వ్యవస్థగా భారత్ : ప్రధాని నరేంద్ర మోడీ

గూగుల్ మ్యాప్ తప్పిదం.. విదేశీ మహిళను కాపాడిన మహిళా రాపిడో రైడర్ (Video)

లెబనాన్‌లో స్వాధీనం చేసుకున్న భూభాగాల నుంచి వైదొలగం.. కాట్జ్

చీరాల బీచ్‌లో 17ఏళ్ల బాలుడిని కాపాడిన పోలీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు

సెప్టెంబరు నెల శ్రీవారి దర్శన కోటా టిక్కెట్లు - 18న ఆన్‌లైన్‌లో విడుదల

తర్వాతి కథనం
Show comments