Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభరాశి వారి ఫలితాలు 2018లో ఇలా వున్నాయి...

కుంభ రాశి: ధనిష్ట 3, 4 పాదములు (గూ, గే) శతభిషం 1, 2, 3, 4 పాదములు (గో, సా, సీ, సూ) పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు (సే, సో, దా), ఆదాయం-8, వ్యయం-14, పూజ్యత-7, అవమానం- 5 ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా వ్యయము నుందు కేతువు, షష్టమము నందు రాహువు, అక్టోబరు 11వ

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (22:06 IST)
కుంభ రాశి: ధనిష్ట 3, 4 పాదములు (గూ, గే) శతభిషం 1, 2, 3, 4 పాదములు (గో, సా, సీ, సూ) పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు (సే, సో, దా), ఆదాయం-8,  వ్యయం-14, పూజ్యత-7, అవమానం- 5
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా వ్యయము నుందు కేతువు, షష్టమము నందు రాహువు, అక్టోబరు 11వ తేదీ వరకు భాగ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి రాజ్యము నందు, ఈ సంవత్సరం అంతా లాభము నందు శని సంచరిస్తారు. 
 
మీ గోచారం పరీక్షించగా, 'అంతా సుభానీ అహోరాత్రః బుద్ధిం తపది తేజస్య'. ఈ రాశివారు తమ తెలివితేటలతో, జ్ఞానంతోను రాత్రి, పగలు అనేది లేకుండా కష్టపడి ఈ సంవత్సరం ఒక వెలుగు వెలుగుతారు. గురు, శని, రాహువులు అందరూ అనుకూల ఫలితాలు ఇచ్చేవిగా ఉన్నందున సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరుపడిన శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. 
 
ఆరింట రాహువు వల్ల విరోధులు అధికమయ్యే అవకాశం ఉంది. పాత సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. కుటుంబీకుల మధ్య సంబంధబాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ప్రణాళికలు రూపొందించడంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రించుకోగలుగుతారు. రుణం తీర్చడానికై చేయు యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. పుణ్యకార్యక్రమాలపై దృష్టిపెడతారు. లాభమునందు శని సంచారం వల్ల ధన లాభములు, కుటుంబంలో సంతృప్తి, ఆరోగ్యం మెరుగవుట, మానసిక ప్రశాంతత వంటివి ఉండగలవు. రాజకీయాల్లో వారికి ఊహించని పదవులు దక్కుతాయి. కుజస్తంభన పెద్దగా ప్రభావం చూపదు. 
 
పట్టుదలతో ప్రతి పనిని సాధించి విజయం మీ సొంతం చేసుకునంటారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, రవాణా రంగాల్లో వారికి సత్‌కాలం. స్నేహితులు బంధువులుగా మారతారు. ప్రతి కార్యములోనూ అందరి సలహా సహకారం అందుకుంటారు. కళా, క్రీడా రంగాల్లో వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది. విదేశీయాన యత్నాలు కూడా ఫలిస్తాయి. సంతానం అభివృద్ధి సంతోషాన్ని కలిగిస్తుంది. అలంకరణ వస్తువులు అమర్చుకుంటారు. భవిష్యత్ గురించి మీరు వేసే ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. 
 
మీ నిర్ణయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం బాగుంటుంది. ఉత్సాహంతో అనుకున్నట్టుగా పనులు పూర్తి చేయగలుగుతారు. పండితులు, శాస్త్రజ్ఞులు చురుకైన ఆలోచనలతో ముందుకుసాగుతారు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారులకు అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. పెట్టుబడులకు కావలసిన ధనం సమకూరుతుంది. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వాహనం విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. 
 
కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది. ప్రత్యర్థుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటారు. రైతులకు వాతావరణం అనుకూలించక కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. షేర్ వ్యాపారస్తులు లాభదాయక ఫలితాలు అందుకుంటారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం నెలకొంటుంది. అనవసర విషయాలపై దృష్టిపెట్టకుండా విద్యా విషయాలపై ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు ఉల్లాసాన్నిస్తాయి. కళాత్మక పోటీల్లో మహిళలు విజయం సాధిస్తారు. పందాలు, జూదాల జోలికి పోవద్దు. ఈ సంవత్సరం అంతా ఎటువంటి అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జయం పొందుతారు. 
 
ఈ రాశివారు విరూపాక్షుని బిల్వదళాలతో పూజించడం వల్ల ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి గుర్తింపు లభిస్తాయి. 
 
ధనిష్ట నక్షత్రం వారికి 'తెల్లపగడం', శతభిషా నక్షత్రం వారికి 'గోమేధికం', పూర్వాభాద్ర నక్షత్రం వారికి 'వైక్రాంతమణి' లేక 'పుష్యరాగం' ధరించిన శుభం కలుగుతుంది. 
 
ధనిష్ట నక్షత్రం వారు 'జమ్మి', శతభిషా నక్షత్రం వారు 'అరటి', పూర్వాభద్ర నక్షత్రం వారు 'మామిడి' చెట్టును దేవాలయాల్లో నాటిన సర్వదా శుభం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

తర్వాతి కథనం
Show comments