Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు ప్రకారం ఇంట్లో ఉసిరికాయ చెట్టు వున్నట్లైతే?

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (15:44 IST)
ఉసిరి ఆకులతో విష్ణుమూర్తిని అర్చించినట్లైతే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఉసిరి చెట్టు వున్న చోట శ్రీమహాలక్ష్మీ దేవి నివాసం వుంటుందని పండితులు చెప్తున్నారు. ప్రతీ మాసంలో వచ్చే ఏకాదశి రోజున నీటిలో ఉసిరికాయలను తరిగి వేసి అరగంట తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి తిథిలో ఉసిరికాయను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
ఆధ్యాత్మిక పరంగా ఉసిరి కాయలను నానబెట్టిన నీటిలో స్నానమాచరించడం.. గంగానదిలో మునిగిన పుణ్య ఫలితాన్ని ఇస్తుందట. ఉసిరి ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఆదివారం, శుక్రవారం, అమావాస్య, షష్ఠి, సప్తమి, నవమి తిథుల్లో ఉసిరి కాయను ఉపయోగించకూడదు. 
 
ఉసిరికాయ చెట్టు ఇంట్లో వుండటం ద్వారా మనచుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పరిచేలా చేస్తుంది. ప్రతికూల అంశాలు చుట్టూ తిరిగినా.. ఉసరి చెట్టు ప్రభావంతో మన ఆలోచన దృక్పథంలో తేడా రాదని పండితులు చెప్తున్నారు. అంతేగాకుండా ఉసిరి చెట్టు మహావిష్ణువు అరచేతిలో నివసిస్తుంది. అలాంటి పుణ్యప్రదమైన ఉసిరి చెట్టును ఇంట్లో పెంచడం, దానిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇంకా కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే నవమి రోజు ఉసిరి చెట్టును పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఆ చెట్టు కింద పది నిమిషాలు కూర్చుని శివుడిని ధ్యానం చేసినా సర్వాభీష్టాలు చేకూరుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఉసిరికాయ చెట్టు వున్నట్లైతే ఈతిబాధలు వుండవు. ఇంటి తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటడం ద్వారా సానుకూల శక్తి లభిస్తుంది. 
 
ఇంట్లో చెట్టును నాటలేక పోతే.. ఆలయంలో వుండే ఉసిరి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురావడం ద్వారా సంపద, జ్ఞానం, కీర్తి పెరుగుతుంది. ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ, మధ్యలో శ్రీ విష్ణువు, కాండంలో శివుడు వుంటారని విశ్వాసం. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటే ఉసిరి చెట్టుకు ఏడుసార్లు నూలు తిరిగి తిరిగి కట్టాలి. తర్వాత నేతితో దీపమెలిగించి, కర్పూరంతో ఉసిరి చెట్టుకు దీపారాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల అనుబంధం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ATM కేంద్రంలో దొంగలు పడ్డారు... గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి డబ్బు కొట్టేశారు..

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

Vijayanagara King: శ్వేతశృంగాగిరిలోని తీర్థంలో స్నానం చేసిన కృష్ణదేవరాయలు.. తర్వాత?

అత్తతో అక్రమ సంబంధం.. యువకుడుని చితకబాది బలవంతపు పెళ్లి

అన్నీ చూడండి

లేటెస్ట్

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

తర్వాతి కథనం
Show comments