Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం దినఫలాలు... శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది...

మేషం : రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బందిపడతారు. క్రయ విక్రయ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్ర

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (06:06 IST)
మేషం : రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బందిపడతారు. క్రయ విక్రయ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ధనం ఏ కొంతయినా సద్వినియోగం అవుతుంది.
 
వృషభం : సోదరి, సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో పనివారితో లౌక్యం అవసరం. సన్నిహితుల నుండి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. విద్యార్ధులు క్రీడలు, క్విజ్ వంటి పోటీలలో రాణిస్తారు.
 
మిథునం : హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యుల రాకపోకలు అధికం అవుతాయి. స్త్రీలకు పనివారిలతో చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలపట్ల ఏకాగ్రత వహించవలసి ఉంటుంది.
 
కర్కాటకం : దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేధాలు తలెత్తవచ్చు. మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. తలపెట్టిన పనిలో సఫలీకృతులు కాగలరు. దూరప్రాంతాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు సంతృప్తి కానవస్తుంది.
 
సింహం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు కళ్ళు, తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. మీ ఆర్థికస్థితికి అవరోధంగా నిలుస్తాయి. రిప్రజెంట్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు.
 
కన్య : స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో కలిసి సంప్రదింపులు జరుపుతారు. ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ఇతర ఒప్పందాలు వాయిదా పడటం మంచిది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
తుల : దైవ కార్యాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారులకు ఆశాజనకం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు.
 
వృశ్చికం : వృత్తి, ఉద్యోగాలయందు ఉన్నవారికి ఆదాయం బాగుటుంది. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది. ప్రతిపని చేతిదాకా వచ్చి వెనక్కిపోవడం వల్ల నిరుత్సాహం, ఆవేదనకు లోనవుతారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
ధనస్సు : ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. వస్త్ర, వెండి, బంగారులోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి.
 
మకరం : మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలలో మెలకువ, ఏకాగ్రత అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. బంధువులను కలుసుకుంటారు.
 
కుంభం : ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసివస్తుంది. మీరు చేపట్టిన పనిలో ఆటంకాలను ఎదుర్కొన్నా జయం మిమ్ముల్ని వరిస్తుంది. భాగస్వామికుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి.
 
మీనం : మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరగలదు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పుట తప్పవు. ప్రైవేటు సంస్థలలో వారికి, పారిశ్రామిక రంగంలో వారికి పనివారితో సమస్యలు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్

26-07-2025 శనివారం దినఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం...

తర్వాతి కథనం
Show comments