Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం రాశిఫలితాలు.. ప్రేమికుల అతి ప్రవర్తన...

మేషం : స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు తలెత్తుతాయి. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతారు. మీ కోసం, మీ కుటుంబీకుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. హోటల్

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (06:16 IST)
మేషం : స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు తలెత్తుతాయి. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతారు. మీ కోసం, మీ కుటుంబీకుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
వృషభం : అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు 
 
మిథునం : విద్యార్థుల చంచల స్వభావం విడనాడి కృషిచేసిన సఫలీకృతులవుతారు. తలపెట్టిన పనులు అర్థాంతరంగా వాయిదాపడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వనసమారాధనలు, దైవకార్యాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన పట్ల దృష్టిసారిస్తారు. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ప్రతికూలత లెదురవుతాయి. 
 
సింహం : ఏజెంట్లు, బ్రోకర్లు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. మీ సంతానం అత్యుత్సాహన్ని అదుపు చేయడం శ్రేయస్కరం. కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవడం మంచిది. బంధువుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు కుటుంబంలోనూ, చుట్టుపక్కల వారితోనూ ఆదరణ లభిస్తుంది. 
 
కన్య : వివాహం నిశ్చయం కావడంతో అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. స్త్రీలకు ఉపవాసాలు, శారీరక శ్రమవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. 
 
తుల : విద్యార్థులకు తోటివారి కారణంగా మాటపడక తప్పదు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించండం అన్ని విధాలా శ్రేయస్కరం. కుటుంబీకులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. 
 
వృశ్చికం : ఆర్థికంగా గతం కంటే బాగుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తులవారి ఆదాయం బాగుటుంది. గతంలో వాయిదాపడిన పనులు పునఃప్రారంభమవుతాయి. నిత్యావసరవస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు వంటివి తప్పవు. 
 
ధనస్సు : సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
మకరం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. నూతన షేర్ల కొనుగోలులో పునరాలోచన అవసరం. నిరుద్యోగులు ఇంటర్వ్యుల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. కృషి, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. 
 
కుంభం : విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రాబడికిమించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. 
 
మీనం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకం. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు శుభదాయకం. ప్రేమికుల అతి ప్రవర్తన అనర్థానికి దారితీస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments