నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఐవీఆర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (22:30 IST)
మిస్సౌరీ: సమాజ సేవలో మేము సైతం అంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ విభాగం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, ఉచిత ఫ్లూ టీకా కార్యక్రమం ఎంతోమంది తెలుగువారితో పాటు స్థానికులకు ఉపయోగపడింది. ఈ వైద్య శిబిరంలో రోగులకు నాట్స్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించారు. ఫ్లూ టీకాలను ఉచితంగా అందించడంలోడాక్టర్ ఏజే కీలక పాత్ర పోషించారు.
 
నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత నాట్స్ బోర్డ్ సభ్యులు సభ్యులు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సౌరీ విభాగం కో-ఆర్డినేటర్ సందీప్ కొల్లిపార, జాయింట్ కో-ఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాగ శ్రీనివాస్ శిస్ట్ల తదితరులతో పాటు వాలంటీర్లు ఈ ఉచిత వైద్య శిబిరం కోసం తమ విలువైన సమయాన్ని, సేవలను అందించారు.
 
ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య పరీక్షల కోసం, ఫ్లూ టీకాలు తీసుకోవడం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. టీకాలు వేయించుకున్నారు. మిస్సోరీలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి

Kurnool : కర్నూలు బస్సు ప్రమాదం.. డ్రైవర్ కనిపించలేదు.. ఏఐ వీడియో వైరల్

కర్నూలు బస్సు ప్రమాదం : సీటింగ్ అనుమతితో స్లీపర్‌గా మార్చారు...

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments