Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్మిగ్రేషన్ అంశాలపై డల్లాస్ నుండి నాట్స్ వెబినార్: విద్యార్థులు, ఉద్యోగుల భవితవ్యంపై అవగాహన

Webdunia
మంగళవారం, 5 మే 2020 (19:15 IST)
డల్లాస్: కరోనా దెబ్బకు అమెరికాలో వలసదారులపై నిబంధనలు కఠినతరం చేస్తుండటంతో అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులలో ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఇమిగ్రేషన్ అంశాలపై వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో ఎవరిపై కొత్త నిబంధనలు ప్రభావం చూపుతాయి..? అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్థుల భవితవ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..? 
 
వర్క్, డిపెడెంట్, ఈఏడీ, విజిటర్ గ్రీన్ కార్డు, ఫ్యామిలీ బేస్డ్ వీసాల విషయంలో ఎలాంటి మార్పుచేర్పులు ఉంటాయనే అంశాలపై ఈ వెబినార్ ద్వారా అవగాహన కల్పించారు. కోడెం లా ఫర్మ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఇమ్మిగ్రేషన్ లాయర్ శారదా కోడెంతో నాట్స్ ఈ వెబినార్ ఏర్పాటు చేసింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ వెబినార్‌లో భారతీయులు, వారికున్న ఇమ్మిగ్రేషన్ సంబంధిత సందేహాలను నివృత్తి చేసుకున్నారు. 
 
కోవిడ్-19 ప్రభావం ఇమ్మిగ్రేషన్లపై ఎలా ఉండనుంది? అన్ని రకాల సంబంధించిన వీసాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై శారద అవగాహన కల్పించారు. ఇప్పుడున్న పరిస్థితులకు ఎలాంటి నిర్ణయాలు ఎంచుకోవాలి..? ప్రస్తుతం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన విశ్లేషణతో పాటు అది నాన్‌ఇమ్మిగ్రేన్ట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది...? నాన్ ఇమ్మిగ్రేన్ట్స్ ఎవరైనా ఉద్యోగం కోల్పోతే నిరుద్యోగ భృతి పొందటానికి గల అవకాశాలు ఉన్నాయా..? 
 
అమెరికా కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థుల వీసాలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అలానే ఇక్కడ వీసాలపై ఉన్న భారతీయలు స్టిములస్ ప్యాకేజీకి అర్హులా కాదా? అమెరికా ప్రభుత్వం ఇటీవల పంపించిన స్టిములస్ చెక్‌లను డిపాజిట్ చేయవచ్చా లేదా? ఇలాంటి అనేక 66 ఇమ్మిగ్రేషన్ ప్రశ్నలకు శారదా కోడెం సమాధానాలు ఇచ్చారు.
 
నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ శేఖర్ అన్నే, నాట్స్ బోర్డు డైరెక్టర్ కిషోర్ వీరగంధం ఈ వెబినార్‌కు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వెబినార్‌లో పాల్గొన్న పలువురి ప్రశ్నలకు సమాధానాలందించడంలో వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విజయ శేఖర్ అన్నే వెల్లడించారు. జూమ్ యాప్ ద్వారా 300 మంది, ఫేస్‌బుక్ ద్వారా మరికొందరు ఈ వెబినార్‌లో పాల్గొన్నట్లు కిషోర్ వీరగంధం తెలిపారు.
 
నాట్స్ డల్లాస్ టీం ఏర్పాటు చేసిన ఈ వెబినార్ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కిషోర్ కంచర్ల, నాట్స్ డల్లాస్ చాప్టర్ కో-ఆర్డినేటర్ అశోక్ గుత్తా, విజయ్ వర్మ కొండా ఈ వెబినార్ నిర్వహణ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ వెబినార్ నిర్వహణకు సహకారం అందించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తదితరులకు నాట్స్ డల్లాస్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

తర్వాతి కథనం
Show comments